ఉన్నత చదువుల కోసం విదేశాలకు(Foriegn Countries) వెళ్లిన తెలంగాణ(Telangana) అబ్బాయి.. అక్కడే చదువుకోడానికి వచ్చిన శ్రీలంక(Sri Lanka) అమ్మాయిని ప్రేమించాడు. తర్వాత ఇద్దరు కుటుంబసభ్యుల్లో ఒప్పించి ఘనంగా పెళ్లి(Marriage) చేసుకున్నారు. వివరాలు చూస్తే.. కరీంనగర్(Karimnagar) కార్పొరేషన్ పరిధిలోని అల్గనూరుకు(alganuru) చెందిన అరుణ్‌కుమార్(Arun Kumar) అక్కడే డిగ్రీ పూర్తిచేశాడు.

Karimnagar
ఉన్నత చదువుల కోసం విదేశాలకు(Foriegn Countries) వెళ్లిన తెలంగాణ(Telangana) అబ్బాయి.. అక్కడే చదువుకోడానికి వచ్చిన శ్రీలంక(Sri Lanka) అమ్మాయిని ప్రేమించాడు. తర్వాత ఇద్దరు కుటుంబసభ్యుల్లో ఒప్పించి ఘనంగా పెళ్లి(Marriage) చేసుకున్నారు. వివరాలు చూస్తే.. కరీంనగర్(Karimnagar) కార్పొరేషన్ పరిధిలోని అల్గనూరుకు(alganuru) చెందిన అరుణ్‌కుమార్(Arun Kumar) అక్కడే డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా(Australia) వెళ్లిపోయాడు. అయితే ఎంబీఏ చదవడానికి ఆస్ట్రేలియాకు శ్రీలంక యువతి అజ్జూరా(Azzura) వచ్చింది. అరుణ్‌కు, అజ్జూరాకు పరిచమం కావడం... అది కాస్తా ప్రేమగా చిగురించడం.. పెళ్లి చేసుకుందామనే వరకు ఇచ్చింది. జీవితంలో ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరి కుటుంబసభ్యులను ఒప్పించుకున్నారు. ఇరు కుటుంబాలు అందుకు అంగీకరించడంతో పెళ్లి పీటలకు ఎక్కారు. అల్గనూరులోని అరుణ్ ఇంటి వద్దనే అంగరంగవైభవంగా వీరి పెళ్లి జరిగింది. పెళ్లి కూతురు శ్రీలంక అమ్మాయి కావాడంతో ఈ పెళ్లి వేడుక చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో పెళ్లి మండపమంతా సందడిగా మారిపోయింది.
