ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. పెళ్లి చేసుకుని ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు లింగమార్పిడి(Gender Transformation) చేసుకున్నారు. ఆ తర్వాతనే అసలు ట్విస్ట్ ప్రారంభమైంది.
ఇద్దరు యువకులు ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. పెళ్లి చేసుకుని ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు లింగమార్పిడి(Gender Transformation) చేసుకున్నారు. ఆ తర్వాతనే అసలు ట్విస్ట్ ప్రారంభమైంది. ఆ లింగ మార్పిడి చేయించుకున్న యువకుడిని పెళ్లి చేసుకునేందుకు మరో యువకుడు నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన బాధితుడు తన ప్రేమికుడి కారుకు నిప్పుపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కాన్పూర్(Kanpur), ఇండర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. స్వలింగ సంపర్కం(Homosexual) పట్ల ఆకర్షితులైన ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని జీవించాలని భావించారు. అయితే ఇక్కడే ట్విస్ట్ జరిగింది. ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు దాదాపు కోటి రూపాయలు వెచ్చించి లింగ మార్పిడి చేయించుకున్నాడు. లింగ మార్పిడి చేసుకుంటే శృంగారానికి సులువవుతుందని భావించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు లింగ మార్పిడి చేయించుకున్న యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అతడి ప్రేమికుడు నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాధితుడు ప్రియుడి కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారుపై(Car) పెట్రోల్(Petrol) పోసి నిప్పంటించిన వీడియో నెట్టింట్ల వైరల్‌గా మారింది.