కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ సోనూ శ్రీనివాస్ గౌడకు(Sonu srinivas Goud) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని(Judicial custody) విధించింది కోర్టు. ఆమె చేసిన తప్పిదమల్లా ఓ బాలికను అక్రమంగా దత్తత(Illegal adoption) తీసుకోవడమే. ఎనిమిదేళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను బాదరహళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
కన్నడ నటి, బిగ్ బాస్ బ్యూటీ సోనూ శ్రీనివాస్ గౌడకు(Sonu srinivas Goud) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని(Judicial custody) విధించింది కోర్టు. ఆమె చేసిన తప్పిదమల్లా ఓ బాలికను అక్రమంగా దత్తత(Illegal adoption) తీసుకోవడమే. ఎనిమిదేళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో సోనూ గౌడను బాదరహళ్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో బెంగళూరు సెంట్రల్ జైలుకు ఆమెను తరలించారు. జువైనల్ జస్టిస్ యాక్ట్, హిందూ దత్తత చట్టాన్ని ఉల్లంఘించినందుకు సోనూ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చట్టపరమైన విచారణ జరగుతోందని అంతకు ముందు సోనూ గౌడ మీడియాకు చెప్పారు. తాను ఓ అమ్మాయిని తీసుకురావడం వెనుక బలమైన కారణం ఉందని, ఆ పాపకు ప్రస్తుతం రక్షణ అవసరమని, ఆమె కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని సోనూ గౌడ చెప్పారు. ఈ కారణంగానే ఆమెను తాను తెచ్చుకున్నానని, ఆమెను సురక్షితంగా చూసుకుంటున్నానని తెలిపారు. మార్చి 2వ తేదీన సోనూ గౌడ తన సోషల్ మీడియా అకౌంట్‌లలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో సోనూతో పాటు ఓ బాలిక కూడా ఉంది. రాయచూర్‌కు చెందిన ఆ బాలికను తాను దత్తత తీసుకుంటున్నట్టు తన తల్లిదండ్రుల సమక్షంలో సోనూ చెప్పారు. దత్తత తీసుకోవడం మంచిదే కానీ దానికి కూడా కొన్ని నియమనిబంధనలు ఉంటాయి. హిందూ దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తికి, దత్తత తీసుకునే బిడ్డకు మధ్య కనీసం 25 ఏళ్ల అంతరం ఉండాలి. ఆపై దత్తత తీసుకున్న వ్యక్తి తన అర్హత గురించి కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీకి తెలియచేయాలి. తర్వాత వారి సమక్షంలోనే దత్తత తీసుకోవాలి. తాను కూడా ఆ బాలిక తల్లిదండ్రులకు వివిధ సౌకర్యాలు కల్పించినట్టు సోనూ తెలిపారు. ఇది ఓ రకంగా విక్రయంలాగే అనిపిస్తున్నదని, పైగా ఆ పాపది స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన వయసని చాలా మంది పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ పాపను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ప్రభుత్వ అనాథాశ్రమంలో చేర్పించారు.