నార్త్ ఈస్ట్ ఢిల్లీ(North East Delhi) లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్(congress) తరఫున పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్‌పై(Kanhaiya Kumar) దాడి జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఆయనపై చేయి చేసుకున్నారు. ఈ దాడికి(attack) సంబంధించిన వీడియోలు విడుదలయ్యాయి. ఈస్ట్ ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పుర్‌లో(New Osmanpur) ఈ సంఘటన జరిగింది.

New Osmanpur
నార్త్ ఈస్ట్ ఢిల్లీ(North East Delhi) లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్(congress) తరఫున పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్‌పై(Kanhaiya Kumar) దాడి జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఆయనపై చేయి చేసుకున్నారు. ఈ దాడికి(attack) సంబంధించిన వీడియోలు విడుదలయ్యాయి. ఈస్ట్ ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పుర్‌లో(New Osmanpur) ఈ సంఘటన జరిగింది. కన్హయ్యపై దాడి చేసిన ఇద్దరు దుండగులు ఈ వీడియోను విడుదల చేశారు. దేశాన్ని విభజించాలంటూ కన్హయ్య వ్యాఖ్యానించారని, అందుకే అతడిపై దాడి చేసినట్టు ఆ ఇద్దరూ ఓ వీడియోలో తెలిపారు. భారతీయ సైన్యంపై కాంగ్రెస్ నేత అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపించారు. కర్తార్‌నగర్‌లో ఆఫీసు నుంచి బయటకు వస్తున్న సమయంలో వీరు వచ్చి కన్హయ్యపై పూలదండ వేశారు. ఆ తర్వాత అతనిపై ఇంకు చల్లారు. భారీగా పిడిగుద్దులు గుద్దారు. ఈ దాడిలో నలుగురు మహిళలు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఓ మహిళ జర్నలిస్టు దగ్గరలో ఉన్న నాలాలో పడిపోయింది. ఈ దాడిని చాలా మంది ఖండించారు. దేశంలో ఇలాంటి పోకడలు రావడం ప్రమాదకరమని వారు వ్యాఖ్యానించారు.
