వచ్చే ఎన్నికల్లో(Assembly Elections) పోటీ చేయడంపై ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చారు ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut). ద్వారకాలోని(Dwaraka) శ్రీకృష్ణుడి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ విలేకరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా.. అని అడగ్గా.. 'భగవాన్ కృష్ణుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఎన్నికల్లో పోరాడుతానని ఆమె సమాధానం ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో(Assembly Elections) పోటీ చేయడంపై ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చారు ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut). ద్వారకాలోని(Dwaraka) శ్రీకృష్ణుడి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ విలేకరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా.. అని అడగ్గా.. 'భగవాన్ కృష్ణుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఎన్నికల్లో పోరాడుతానని ఆమె సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉన్నట్లు పరోక్షంగా కంగనా హింట్ ఇచ్చారు. గత కొంత కాలంగా కంగనా కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్రమోదీపై(Narendra Modi) ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సుదీర్ఘ పోరాటం వల్లే అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమైందని ఆమె అన్నారు. సనాతన ధర్మ(Sanatana Dharm) పతాకం ప్రపంచ వ్యాప్తంగా రెపరెపలాడాలని కంగనా రనౌత్ ఆకాంక్షించారు. ఆధ్యాత్మికతకు ద్వారకా నెలవు, ఇక్కడ ఉన్న ప్రతీది అద్భుతమేనంటూ.. ప్రతి అణువులోనూ ద్వారకావాసుడు ఉన్నారని చెప్పుకొచ్చారు. కృష్ణుడి ద్వారకా ఒక స్వర్గంలాంటిదని అన్నారు. వీలు కుదిరినప్పుడల్లా స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటానని తెలిపారు. నీట మునిగిన ద్వారకాను పై నుంచి చూసినా కనపడుతుందని.. కానీ నీటి అడుగుభాగానికి వెళ్లి ఆ నాటి గుర్తులను చూసేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కంగనా అన్నారు. ఇక కంగనా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె కీలకంగా నటించిన 'ఎమర్జెన్సీ'(Emergency) విడుదలకు సిద్ధంగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపించబోతున్నారు. ఈ మధ్యే విడుదలైన 'తేజస్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఫలితాలు రాబట్టలేకపోయింది.