బాలీవుడ్ హీరోయిన్, వివాదాస్పద నటి కంగనా రనౌత్(Kangana Ranaut) లోక్‌సభ సభ్యురాలయ్యింది. హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లోని మండి లోక్‌సభ నియోజకవర్గం(Mandi Lok Sabha Constituency) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన కంగనా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Kangana Ranaut and Chirag Paswan
బాలీవుడ్ హీరోయిన్, వివాదాస్పద నటి కంగనా రనౌత్(Kangana Ranaut) లోక్‌సభ సభ్యురాలయ్యింది. హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లోని మండి లోక్‌సభ నియోజకవర్గం(Mandi Lok Sabha Constituency) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన కంగనా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాశ్వన్(Chirag Paswan) విజయం సాధించారు. వీరిద్దరికి సంబంధించిన ఓ విషయం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వీరిద్దరు లోక్‌సభలో అడుగుపెడుతున్నారని కాదు. గతంఓ వీరిద్దరు కలసి ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. 2011లో వచ్చిన మిలే నా మిలే హమ్ సినిమా(Miley Naa Miley Hum)లో వీరిద్దరు జంటగా నటించారు. హీరోగా బాలీవుడ్‌లో నిలదొక్కుకుందామనుకున్న చిరాగ్ పాశ్వాన్‌ను ఈ సినిమా బాగా నిరాశపర్చింది. సినిమాలు లాభం లేదనుకుని తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్(Ram Vilas Paswan) అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు చిరాగ్. మొన్నటి ఎన్నికల్లో బీహార్‌లోని హాజీపూర్ నుంచి విజయం సాధించారు. అన్నట్టు ఎల్జేపీ నుంచి అయిదుగురు ఎంపీలుగా విజయం సాధించారు.
