కార్గిల్ యుద్ధం(Kargil war) జరిగి ఈ రోజుకి సరిగ్గా 24 సంవత్సరాలు. పాకిస్తాన్(Pakistan) పై భీకర యుద్ధం చేసి దేశానికి విజయాన్ని మన సైనికులు అందించారు. 1999 మే 3 న ప్రారంభం అయిన యుద్ధం 83 రోజుల పాటు జరిగి 1999 జులై 26 న పాకిస్తాన్ పై విజయంతో ముగిసింది. అత్యంత ధర్య సాహసాలు ప్రదర్శించి మన కార్గిల్ వార్ హీరోస్ దేశానికి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

కార్గిల్ యుద్ధం(Kargil war) జరిగి ఈ రోజుకి సరిగ్గా 24 సంవత్సరాలు. పాకిస్తాన్(Pakistan) పై భీకర యుద్ధం చేసి దేశానికి విజయాన్ని మన సైనికులు అందించారు. 1999 మే 3 న ప్రారంభం అయిన యుద్ధం 83 రోజుల పాటు జరిగి 1999 జులై 26 న పాకిస్తాన్ పై విజయంతో ముగిసింది. అత్యంత ధర్య సాహసాలు ప్రదర్శించి మన కార్గిల్ వార్ హీరోస్ దేశానికి చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

భారత్ పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది. నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది (మొదటిది చైనా - సోవియట్ ల మధ్య 1969 లో జరిగింది.

భారత్-పాకిస్తాన్ విభజన జరగక ముందు కార్గిల్ ప్రాంతం లద్దాక్ ప్రాంతం లోని బల్టిస్తాన్ జిల్లాలో భాగంగా ఉండేది. మొదిటి కాశ్మీర్ యుద్ధం (1947–48) తర్వాత నియంత్రణ రేఖ బల్టిస్తాన్ జిల్లాగుండా ఏర్పడింది. దీంతో కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూ-కాశ్మీర్ లో భాగమైంది.[12] 1971లో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఇరు దేశాలు సిమ్లా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దుని అంగీకరించడంతో పాటు ఇక్కడ ఎటువంటి కాల్పులకు దిగకూడదు.

కార్గిల్ ప్రాంతం శ్రీనగర్ నుంచి 205 కి.మీ. ల దూరంలో ఉంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత −48 °C గా ఉంటుంది.శ్రీనగర్ - లేహ్ లను కలిపే జాతీయ రహదారి (NH 1D) కార్గిల్ గుండా వెళుతుంది. ఈ ప్రాంతం లోకి పాకిస్తాన్ చొరబాటుదారులు వచ్చి 160 కి.మీ. పొడవునా కొండలపైనుంచి కాల్పులు జరిపారు. కొండల మీదున్న సైనిక స్ధావరాలు 16,000 అడుగుల ఎత్తులో (కొన్నైతే 18,000 అడుగుల ఎత్తులో) ఉన్నాయి. చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్ధావరాలను స్వాధీన పర్చుకోవడం ద్వారా ఆ ప్రాంతం పై పట్టు సాధించడం కోసమే కార్గిల్ మీద దాడికి దిగడానికి ముఖ్యకారణం.

1971 లో భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే అయినా సియాచెన్ మీద పట్టు సాధించటానికి ఇరు దేశాలు చుట్టు పక్కల ఉన్న కొండల మీద సైనిక స్ధావరాలను ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి. 1990లలో కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటువాదం, అణు ప్రయోగాల వల్ల ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని లాహోర్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి "ఆపరేషన్ బద్ర్" అని రహస్య పేరు పెట్టారు . దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం, భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఉద్దేశం.

భారత సైన్యాధిపతి వేద్ ప్రకాష్ మాలిక్, ఎందరో ఇతర పండితుల ప్రకారం, ఈ కార్యక్రమానికి పాకిస్తానీయులు చాలాకాలం క్రితమే రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ యుద్ధ తీవ్రతకి భయపడి పాకిస్తాన్ నాయకులు వెనక్కి తగ్గారు. 1998 లో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవ్వగానే మళ్ళీ ఈ పథకానికి ప్రాణం పోశాడు. యుద్ధానంతరం పాక్ ప్రధాని, నవాజ్ షరీఫ్, ఈ విషయాలేవీ తనకు తెలియవని, భారత ప్రధాని వాజపాయ్ చేసిన ఫోన్ ద్వారానే ఈ విషయాలు తెలిసాయని తెలిపాడు. ఈ పథకం మొత్తం ముషారఫ్, అతని సన్నిహిత సైనికాధికారులు కలిసి చేశారని షరీఫ్, చాలా మంది పాక్ రచయితలు చెప్పారు.. కాని ముషారఫ్ ఈ పథకాన్ని, లాహోర్ ఒప్పందానికి 15 రోజుల ముందే షరీఫ్ కు తెలియపరిచానని చెప్పాడు.

యుద్ధం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి దశలో, పాక్ దళాలు భారత కాశ్మీర్ లోకి చొరబడి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను ఆక్రమించుకుని ఎన్.హెచ్.1 (జాతీయ రహదారి) ని శతఘ్నుల పరిధిలోకి తెచ్చుకున్నాయి. రెండో దశలో, భారత దళాలు చొరబాట్లను గుర్తించి సైన్యాన్ని సమాయత్తం చేసింది. మూడో దశలో యుద్ధం చేసి భారతదేశం పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకుంది.

మొదట్లో భారత సైన్యం ఈ చొరబాట్లను పలు కారణాల వల్ల గుర్తించలేదు. గస్తీ కాసే దళాలను చొరబాట్లు జరిగిన ప్రాంతాలకి పంపలేదు, శతఘ్నులతో పాక్ దాడులు చేస్తూ చొరబాటు దారులకు వీలు కల్పించింది. కానీ, మే రెండో వారానికి, సౌరభ్ కాలియా నేతృత్వం లోని భారత గస్తీ దళంపై జరిగిన ఆకస్మిక దాడి వల్ల చొరబాట్లు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో చొరబాట్ల తీవ్రత తెలియని భారత దళాలు, ఇది కేవలం ఉగ్రవాదుల (జీహాదీలు) పని ఆనుకుని రెండు మూడు రోజుల్లో వారిని వెళ్ళగొట్టవచ్చు అనుకుంది. కానీ నియంత్రణ రేఖ వెంబడి అనేక చోట్ల పరిస్ధితి ఇలాగే ఉండడాన, వీరు అవలంబిస్తున్న పద్ధతులలో తేడాల వల్లనూ ఇది చాలా పెద్ద దాడేనని నిర్ధారణకు వచ్చాయి. మొత్తం 130 - 200 చ.కి.మీ. మేర భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.

భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ తో జవాబిచ్చింది. 200,000 భారత సైనికులను పంపింది. భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ని ప్రారంభించింది. భారత నావికా దళం కూడా పాకిస్తాన్ కు చెందిన ఓడరేవులకు (ముఖ్యంగా కరాచి ఓడరేవుకి) వెళ్ళే మార్గాలను మూసివేసేందుకు సిద్ధమైంది.

అంతిమంగా 83 రోజుల భీకర యుద్ధం తరవాత 527మంది వీరజవానుల తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకి విజయాన్ని అందించారు. ఆ రోజు నుంచి ప్రతీ ఏడూ జులై 26 న కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం.

అందుకే అందరం ఒక్కసారి గట్టిగా నినదిద్దాం జై జవాన్, జై భారత్.

Updated On 26 July 2023 1:32 AM GMT
Ehatv

Ehatv

Next Story