జమ్మూ కాశ్మీర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది.

జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) ఈరోజు తీర్పు వెలువరించనుంది. ఈ ఆర్టికల్(Article) ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా(Special Status) లభించింది.

సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం.. డిసెంబర్ 11న అంటే ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(Dhananjaya Yeshwant Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఈ బెంచ్‌లో సీజేఐ(CJI)తో పాటు జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్ ఉన్నారు. సెప్టెంబర్ నెలలో వరుసగా 16 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచడం గమనార్హం.

16 రోజుల పాటు జరిగిన విచారణలో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేష్ ద్వివేది, వీ గిరి తదితరుల వాదనలు, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ మధ్యవర్తులు వాదనలు వినిపించారు. పూర్వ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం.. జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం యొక్క చెల్లుబాటు.. జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి, గవర్నర్ పాలన విధించడం, పొడిగించడంతో సహా పలు అంశాలపై తమ‌ అభిప్రాయాలను న్యాయ‌వాదులు వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 రద్దును సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను 2019లో రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 కారణంగా.. పూర్వపు రాష్ట్రం జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది.

Updated On 10 Dec 2023 10:43 PM GMT
Yagnik

Yagnik

Next Story