ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసును విచారిస్తున్న రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ మంగ‌ళ‌వారం బదిలీ అయ్యారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం(Delhi Liquor Scam) కేసును విచారిస్తున్న రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్(MK Nagpal) మంగ‌ళ‌వారం బదిలీ అయ్యారు. జడ్జి నాగ్‌పాల్ మద్యం పాలసీ కేసును ప్రారంభమైనప్పటి నుంచి విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత, ఎంపీ మాగుంట త‌న‌యుడు రాఘ‌వ‌ వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు.

రాఘ‌వ అప్రూవ‌ర్‌గా మార‌గా.. మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్‌లో ఉన్నారు. న్యాయమూర్తి నాగ్‌పాల్ బ‌దిలీ అనంత‌రం తీస్ హజారీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నాగ్‌పాల్ స్థానంలో కావేరీ బవేజా రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Updated On 19 March 2024 10:31 AM GMT
Yagnik

Yagnik

Next Story