రానున్న‌ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సన్నాహకాల కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం జైపూర్ చేరుకోనున్నారు. బీజేపీ సీనియర్ నేతల కోర్ కమిటీ, క్రమశిక్షణా కమిటీ సహా పలు కమిటీల సభ్యులతో జేపీ నడ్డా ఇక్కడ సమావేశం కానున్నారు.

రానున్న‌ రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల(Rajasthan Election 2023)కు రాజకీయ పార్టీలు(Political Parties) సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సన్నాహకాల కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) శనివారం జైపూర్(Jaipur) చేరుకోనున్నారు. బీజేపీ సీనియర్ నేతల కోర్ కమిటీ, క్రమశిక్షణా కమిటీ సహా పలు కమిటీల సభ్యులతో జేపీ నడ్డా ఇక్కడ సమావేశం కానున్నారు. అనంత‌రం జేపీ నడ్డా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే(Vasundhara Raje), కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్(Arjun Ram Meghwal), గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekawat), కైలాష్ జోషి(Kailash Joshi), రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి(CP Joshi), అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్‌(Rajendra Rathod)లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ స‌మావేశానికి రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రహ్లాద్ జోషి(Prahlad Joshi) కూడా హాజరుకానున్నారు.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో JP నడ్డా పర్యటన చాలా ముఖ్యమైనదిగా నేత‌లు భావిస్తున్నారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లను కలుపుకునేందుకు జైపూర్‌లో జులై 30న మహిళా సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో వసుంధర రాజే ప్రసంగిస్తారు. మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆగస్టు 9న రాష్ట్రంలోని బన్స్వారాలో ఉన్న గిరిజనుల ప్రధాన మతస్థలమైన మాన్‌గర్ ధామ్‌లో గిరిజన సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. రాష్ట్రంలోని దాదాపు రెండు డజన్ల అసెంబ్లీ స్థానాలు గిరిజనులపై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. గిరిజన ఓటర్లను ఆకర్షించేందుకు ఈసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పార్టీ స్థాయిలో నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆగస్టు 1న కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా(Sukhjinder Singh Randhawa), రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార(Gobind Singh Dotasara) ఉదయపూర్, బన్స్వారాలో పర్యటించనున్నారు.

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలు ప్రారంభించిందని శివసేన (షిండే వర్గం) రాష్ట్ర ఇన్‌ఛార్జ్ చంద్రరాజ్ సింఘ్వీ(Chandraraj Singhvi)చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నాం. లాల్ డైరీని ఎన్నికల అంశంగా మారుస్తామని సింఘ్వీ చెప్పారు.

Updated On 28 July 2023 9:50 PM GMT
Yagnik

Yagnik

Next Story