బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించారు. జనవరిలో
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించారు. జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం ప్రకటించగా.. తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆమోదించింది. జేపీ నడ్డా స్వయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని పార్టీ ఆయనకు కట్టబెట్టింది.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలు, ప్రచార పర్వం వంటి అంశాలపై వేలాది మంది పార్టీ సభ్యుల సమక్షంలో చర్చ చేపట్టారు. 2019లో పార్టీ చీఫ్ అమిత్ షా కేంద్ర మంత్రి పదవిలో ఉండగా జేపీ నడ్డా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టారు. 2020లో పార్టీ పూర్తికాల అధ్యక్ష బాద్యతలను జేపీ నడ్డా చేపట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించారు. జేపీ నడ్డా నాయకత్వంలో బీజేపీ పలు రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించిందని, కొన్ని రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో తమ ఎమ్మెల్యేలు గెలుపొందారని నడ్డా పదవీకాలం పొడిగింపును ప్రకటిస్తూ అమిత్ షా ప్రస్తావించారు.
పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారం JP నడ్డాకు ఇచ్చారు. ఈ నిర్ణయం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశం రెండవ రోజు నుండి వచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహం, ప్రచారాలను గురించి చర్చించడానికి వేలాది మంది పార్టీ సభ్యులు, అగ్ర నాయకత్వంతో సమావేశమయ్యారు