వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS rajashekar reddy) సతీమణి విజయమ్మ(Vijayamma) మళ్లీ కుమారుడు జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan reddy) వైపుకు వచ్చారు. కాంగ్రెస్‌తో(Congress) తెగతెంపులు చేసుకుని సొంతంగా పార్టీ పెట్టుకున్ననాటి నుంచి విజయమ్మ కొడుకుతోనే ప్రయాణించారు. ఏపీ అంతా తిరిగి పార్టీ బలోపేతం కూడా శ్రమించారు. జగన్‌ జైలులో ఉన్న సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున దీక్షలు చేశారు. ఆ పార్టీ సింబల్‌పై విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ కూడా చేశారు.

వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS rajashekar reddy) సతీమణి విజయమ్మ(Vijayamma) మళ్లీ కుమారుడు జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan reddy) వైపుకు వచ్చారు. కాంగ్రెస్‌తో(Congress) తెగతెంపులు చేసుకుని సొంతంగా పార్టీ పెట్టుకున్ననాటి నుంచి విజయమ్మ కొడుకుతోనే ప్రయాణించారు. ఏపీ అంతా తిరిగి పార్టీ బలోపేతం కూడా శ్రమించారు. జగన్‌ జైలులో ఉన్న సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున దీక్షలు చేశారు. ఆ పార్టీ సింబల్‌పై విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ కూడా చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ స్టార్‌ క్యాంపేనర్లుగా జగన్‌, విజయమ్మ, షర్మిల రాష్ట్రమంతా తిరిగారు. సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. జగన్‌ వెళ్లలేని నియోజకవర్గాలకు తను వెళ్లి ప్రచారం చేశారు విజయమ్మ. తన కుమారుడికి ఒక అవకాశం ఇవ్వమంటూ ప్రజలను వేడుకున్నారు. 2021 వరకు విజయమ్మ వైఎస్‌ఆర్‌ సీపీలోనే ఉన్నారు. తెలంగాణలో కూతురు షర్మిల పార్టీ పెట్టేంత వరకు విజయమ్మ వైసీపీలోనే ఉన్నారు. ఎప్పుడైతే షర్మిల(YS Sharmila) వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) పెట్టిందో అప్పుడు వైసీపీ గౌవర అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీలో చేరి కూతురు దగ్గరే ఉన్నారు. ఇప్పుడు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అయితే ఆ విలీన కార్యక్రమానికి విజయమ్మ వెళ్లలేదు. బ్రదర్‌ అనిల్‌కుమర్‌, షర్మిల మాత్రమే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ల చేరారు. ఆ విలీనానికి తాను మద్దతు అని కూడా ఎక్కడా చెప్పలేదు. అసలు ఇంతకీ వై.ఎస్‌.విజయమ్మ ఏ పార్టీలో ఉన్నారు? రేపొద్దున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కొడుకు వైపు ఉంటారా? లేక కూతురుకు మద్దతు ఇస్తారా? సమాధానాల కోసం ఈ వీడియో చూడండి.

Updated On 6 Jan 2024 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story