మద్యం కొనుక్కోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు.
మద్యం కొనుక్కోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మద్యం ఇంటికే వస్తుందట! స్విగ్గీ(Swiggy), జొమాటోలలో(Zomato) లిక్కర్‌ను(Liqour) బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో మద్యపాన నిషేధానికి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతున్నాయి. రాజకీయపార్టీలు మద్యపాన నిషేధం విధిస్తామంటూ హామీలు కూడా ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దేశంలోని కొన్ని రాష్ట్రాలు మద్యాన్ని డోర్ డెలివరీ చేయాలనే ఆలోచన చేస్తున్నాయి. ఉత్తరాదికి చెందిన కొన్ని రాష్ట్రాలు, పక్కనే ఉన్న కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు ఇలాంటి ఆలోచనలో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నాయి. వాటిల్లో స్విగ్గీ, జొమాటో యాప్‌లు కంపల్సరీ. ఇకపై వీటి ద్వారా నేరుగా ఇళ్లకే మద్యాన్ని సరఫరా చేయిస్తే ఎలా ఉంటుందన్నదానిపైన ఈ కామర్స్ నిపుణులు అధ్యయనం చేస్తున్నట్టుగా సమాచారం. మెట్రోపాలిటిన్ సిటీ అయిన ఢిల్లీలో, హర్యానాలో లిక్కర్ వాడకం ఎక్కువ. ఇప్పుడు లిక్కర్‌ను డోర్ డెలివరీ చేస్తామంటే మద్యం వాడకం విపరీతంగా పెరుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో లిక్కర్‌ను డోర్ డెలివరీ చేయించాలన్న డిమాండ్ ఉంది. లిక్కర్‌ను డోర్ డెలివరీ చేస్తే కలిగే ప్రయోజనాలేమిటి? ఈ ఆలోచన మంచిదేనా? ఈ వీడియోలో చూద్దాం..