వన్డే ప్రపంచకప్‌(Worldcup 2023) చేజారిపోయిందేనన్న బాధ భారతీయులందరిలోనూ ఉంది. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమిండియా(Team India) ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఇన్సింగ్స్‌ కొనసాగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి అనూహ్యంగా ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. అప్పుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) క్రీజ్‌లో ఉన్నాడు,ఫ్రీ పాలస్తీనా(Free Palestine) అని రాసి ఉన్న టీషర్ట్‌(Tshirt) ధరించిన ఆ వ్యక్తి నేరుగా కోహ్ల దగ్గరకు వెళ్లి భుజంపై చేయి కూడా వేశారు.

వన్డే ప్రపంచకప్‌(Worldcup 2023) చేజారిపోయిందేనన్న బాధ భారతీయులందరిలోనూ ఉంది. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమిండియా(Team India) ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఇన్సింగ్స్‌ కొనసాగుతున్న సమయంలో గ్రౌండ్‌లోకి అనూహ్యంగా ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. అప్పుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) క్రీజ్‌లో ఉన్నాడు,ఫ్రీ పాలస్తీనా(Free Palestine) అని రాసి ఉన్న టీషర్ట్‌(Tshirt) ధరించిన ఆ వ్యక్తి నేరుగా కోహ్ల దగ్గరకు వెళ్లి భుజంపై చేయి కూడా వేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అతడు ఆస్ట్రేలియాకు చెందిన జాన్సన్‌ వేన్‌(Johnson Wayne) అని పోలీసుల విచారణలో తేలింది. జాన్సన్‌ పబ్లిసిటీ కోసమే ఇలా చేశాడని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో ఉన్న సమస్యలను అడ్డుపెట్టుకుని ఇలా స్పోర్ట్స్‌ ఈవెంట్లను అంతరాయం కలిగిస్తాడని తేలిసింది. ఫేమస్‌ టిక్‌టాకర్‌(Tiktoker) గా ప్రచారం చేసుకోవడానికి ఇలాంటి సాహసాలకు పాల్పడుతుంటానని జాన్సన్‌ వేన్‌ చెప్పాడు. 'నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. కోహ్లీని కలవడానికి గ్రౌండ్‌లోకి వెళ్లాను. పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధంపై నిరసన చెప్పడానికి ఇలా చేశాను' అని జాన్సన్‌ వేన్‌ విలేకరులతో చెప్పాడు. ఇలా గ్రౌండ్స్‌లోకి దూసుకురావడం జాన్సన్‌ వేన్‌కు కొత్తేమీ కాదు. ఇదే ఏడాది ఆగస్గులో ఇంగ్లాండ్‌(England)-స్పెయిన్‌(Spain) మధ్య జరిగిన మహిళల ప్రపంచకప్‌(Worldcup) ఫుట్‌బాల్‌(Football) ఫైనల్‌ మ్యాచ్‌లోనూ ఇలాగే చేశాడు. భద్రతాసిబ్బంది కళ్లు కప్పి గ్రౌండ్‌లోకి వెళ్లారు. అప్పుడు ఫ్రీ ఉక్రెయిన్‌.. స్టాప్‌ పుట్లర్‌ అని రాసిన ఉన్న టీషర్ట్‌ వేసుకుని నిరసన తెలిపాడు. పుతిన్‌ను హిట్లర్‌తో పోలుస్తూ ఆ మాటన్నాడు. మూడేళ్ల కిందట ఓ రగ్బీ మ్యాచ్‌కు కూడా అంతరాయం కలిగించి డ్యాన్స్‌ చేశాడు. అప్పుడు అతడికి 200 ఆస్ట్రేలియా డాలర్లు జరిమానా విధించారు.

Updated On 21 Nov 2023 6:02 AM GMT
Ehatv

Ehatv

Next Story