పులులు కూడా ప్రేమిస్తాయట.. విరహవేదన అనుభవిస్తాయట.

పులులు కూడా ప్రేమిస్తాయట.. విరహవేదన అనుభవిస్తాయట. అవును మీరు చదువుతున్నది నిజమే. ఓ పులి(Tiger) తన లవర్‌ కోసం మహారాష్ట్ర(Maharastra) నుంచి తెలంగాణకు(Telangana) దాదాపు 300 కి.మీ.నడుస్తూ వచ్చింది. మహారాష్ట్ర నాందేడ్‌లోని కిన్‌వాట్‌కు చెందిన జానీ అనే టైగర్ తన లవర్‌ను వెతుక్కుంటూ వచ్చిందని అటవీఅధికారులు(Forest officers) తెలుపుతున్నారు. పులులు తమ వేట కోసం చాలా సేపు ఓపికగా వేచి ఉంటాయి. అవి తమ సహచరిణి కోసం వందల కి.మీ.ప్రయాణం చేయొచ్చు. చలికాలం పులులకు సంభోగం కాలం అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని మగ పులులు తమ ఆడ పులులను వెతుక్కుంటూ దూర ప్రయాణాలు చేస్తాయి. ఇలాగే జానీ అనే పులి అక్టోబర్‌ మొదటి వారంలో మహారాష్ట్ర నాందేడ్‌లోని(Nanded) కిన్‌వాట్‌(Kinwat) నుంచి ప్రయాణం మొదలుపెట్టిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 30 రోజుల్లో ఆదిలాబాద్(Adilabad), నిర్మల్(Nirmal) జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రయాణించింది.

మహారాష్ట్రకు చెందిన 7 ఏళ్ల పులి నెల రోజులుగా సహచరుడి కోసం వెతుకుతోంది. ఇప్పటి వరకు 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాంతంలోని అడవుల్లో ఆడపులి దగ్గరకు చేరుకోనుందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర నుంచి మగ పులులు ప్రతి శీతాకాలంలో వాటి సోల్‌మెట్ల కోసం పూర్వ ఆదిలాబాద్ జిల్లా అడవులకు వలస వస్తుంటాయని జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బి పాటిల్ అన్నారు. పులులు 100 కిలోమీటర్ల దూరం నుండి ఆడ పులులు విడుదల చేసే ప్రత్యేక సువాసనను పసిగట్టగలవని, ఆడ పులులను గుర్తించగలవని అధికారులు తెలిపారు.

జానీ ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్, నిర్మల్ జిల్లాలోని కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో పర్యటించి ఉట్నూర్ మండలంలో సంచరిస్తోంది. తన సుదీర్ఘ ప్రయాణంలో జానీ ఇప్పటికే ఐదు పశువులను చంపేసింది. మరో మూడు ఆవులను చంపేందుకు ప్రయత్నించింది. ఈ పులి ఉట్నూర్‌లోని లాల్‌టెక్డి గ్రామ సమీపంలో రోడ్డు దాటుతుండగా స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు.

Eha Tv

Eha Tv

Next Story