జమ్మూ కశ్మీర్‌లోని రియాసిలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు

జమ్మూ కశ్మీర్‌లోని రియాసిలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు. అతడి గురించి సమాచారం ఇస్తే రూ.20 లక్షల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా ఉగ్రవాది స్కెచ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

"ఇటీవల పౌని ప్రాంతంలో యాత్రికుల బస్సుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆచూకీ గురించిన సమాచారం ఇచ్చే వారికి రియాసి పోలీసులు రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు" అని పోలీసు ప్రతినిధి వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. ఆదివారం, పోనీ ప్రాంతంలోని టెర్యాత్ గ్రామ సమీపంలోని కత్రాలోని శివ ఖోరీ ఆలయం నుండి మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ నుండి యాత్రికులను తీసుకువెళుతున్న బస్సు.. కాల్పుల కారణంగా లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల జాడ కోసం విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. 11 బృందాలు సెర్చ్ ఆపరేషన్ ను మొదలు పెట్టాయి.

Updated On 11 Jun 2024 10:07 PM GMT
Yagnik

Yagnik

Next Story