సాధారణంగా ఇతర దేశాలు వెళ్లేందుకు, అక్కడి టూరిస్ట్ ప్రదేశాలను చూసేందుకు టూరిస్ట్ వీసా(Tourist Visa) తెచ్చుకొని ఆయా దేశాలను చుట్టి వస్తుంటారు. కానీ ఓ భారతీయుడు వినూత్నంగా ఆలోచించాడు. ఆస్ట్రేలియా(Australia) వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని(Road route) ఎంచుకున్నాడు. అంతేకాకుండా సైకిల్‌ పైనే(Cycle) ఆస్ట్రేలియా చుట్టిరావాలని నిర్ణయించుకొని ప్రయాణం ప్రారంభించాడు.

సాధారణంగా ఇతర దేశాలు వెళ్లేందుకు, అక్కడి టూరిస్ట్ ప్రదేశాలను చూసేందుకు టూరిస్ట్ వీసా(Tourist Visa) తెచ్చుకొని ఆయా దేశాలను చుట్టి వస్తుంటారు. కానీ ఓ భారతీయుడు వినూత్నంగా ఆలోచించాడు. ఆస్ట్రేలియా(Australia) వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని(Road route) ఎంచుకున్నాడు. అంతేకాకుండా సైకిల్‌ పైనే(Cycle) ఆస్ట్రేలియా చుట్టిరావాలని నిర్ణయించుకొని ప్రయాణం ప్రారంభించాడు. అందుకోసం పలుదేశాలు దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే మయన్మార్(Myanmar), థాయ్‌లాండ్(Thailand), మలేసియా(Malasiya), ఇండోనేషియా(Indonesia) దేశాలను దాటేశాడు.

జెర్రీ చౌదరి(Jerry Chowdhury) అనే భారతీయుడు భారతదేశం నుంచి ఆస్ట్రేలియా వరకు సైకిల్‌పై ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను సందర్శించే ప్రతి దేశంలోని విభిన్న సంస్కృతులు, సుందరమైన అందాలకు సంబంధించి వీడియోలను షేర్‌ చేస్గుంటారు. తన ప్రయాణంపై ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తుంటాడు. ప్రతి దేశ సరిహద్దును దాటుతూ స్థానికులతో చర్చిస్తుంటాడు. సుందర ప్రదేశాలను, తనకు ఎదురయ్యే సవాళ్లను కెమెరాలో బంధిస్తూ సామాజిక మాధ్యమంలో షేర్‌ చేస్తుంటాడు. జెర్రీ చౌదరి సాహస యాత్రపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన వీడియోల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అతను పోస్ట్ చేసిన వీడియోలు క్షణాల్లో భారీగా వ్యూస్‌ను సంపాదిస్తున్నాయి. దీంతో తన ఇన్‌స్టా అకౌంట్‌కు క్రేజ్ పెరిగింది.
ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తూ.. మీ సాహసానికి సల్యూట్‌.. సురక్షితంగా ప్రయాణించాలని కోరుతున్నారు. తన గమ్యాన్ని చేరేందుకు గొప్ప సాహసమే చెప్పాటరని జెర్రీచౌదరిని పొగుడుతున్నారు.

Updated On 12 Jan 2024 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story