రాజస్తాన్‌లోని(Rajasthan) కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కోచింగ్‌ సెంటర్లకు(Coaching center) ప్రసిద్ధిగాంచిన కోటాలో ఎంతో మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నిహారిక(Niharika) అనే 18 ఏళ్ల అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది.

రాజస్తాన్‌లోని(Rajasthan) కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. కోచింగ్‌ సెంటర్లకు(Coaching center) ప్రసిద్ధిగాంచిన కోటాలో ఎంతో మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నిహారిక(Niharika) అనే 18 ఏళ్ల అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. కోటాలోని(Kota) శిక్షానగరి ప్రాంతంలో ఉంటున్న నిహారిక జేఈఈ పరీక్షకు ప్రిపేర్‌ అవుతోంది. జనవరి 31వ తేదీన జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురైన నిహారిక తను ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు(Hang) ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. తాను జేఈఈ చేయలేనంటూ తన తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసి తనువు చాలించింది. ‘అమ్మా, నాన్న.. నేను జేఈఈ చేయలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకున్న ఆప్షన్‌ ఇదొక్కటే.. నేనో చెత్త కూతుర్ని. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌లో రాసింది. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న కోటా పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లోనే ఇది రెండో ఆత్మహత్య ఘటన కావడం విషాదం. 23వ తేదీన నీట్‌ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. 2023లో కోటాలో ఏకంగా 29 మంది విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు.

Updated On 29 Jan 2024 7:26 AM GMT
Ehatv

Ehatv

Next Story