కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్(RCP Singh) గురువారం బీజేపీలో(BJP) చేరారు. న్యూఢిల్లీలోని(New Delhi) బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన బీజేపీ అధికారిక సభ్యత్వం తీసుకున్నారు. ఏడాది కాలంగా ఆర్‌సిపి సింగ్ బీజేపీలో చేర‌నున్నార‌నే ఊహాగానాలు విన‌బ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేడు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఆర్‌సిపి సింగ్ పార్టీలో చేరిక‌ సమయంలో హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్(RCP Singh) గురువారం బీజేపీలో(BJP) చేరారు. న్యూఢిల్లీలోని(New Delhi) బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన బీజేపీ అధికారిక సభ్యత్వం తీసుకున్నారు. ఏడాది కాలంగా ఆర్‌సిపి సింగ్ బీజేపీలో చేర‌నున్నార‌నే ఊహాగానాలు విన‌బ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేడు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఆర్‌సిపి సింగ్ పార్టీలో చేరిక‌ సమయంలో హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఆర్‌సీపీ సింగ్ ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో దాదాపు ఏడాది పాటు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నితీష్ కుమార్, జేడీయూతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.

ఆర్‌సీపీ సింగ్ బీజేపీతో కలిసి జేడీయూను(JDU) దెబ్బతీయడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే చాలా చోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారనే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు నితీష్ కుమార్ అనుమతి లేకుండానే ఆర్‌సీపీ సింగ్ కేంద్ర మంత్రి పదవిని చేపట్టాలని నిర్ణయించుకున్నారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న జేడీయూకు రాజీనామా చేశారు.

రెండు రోజుల క్రితం జేడీయూకి రాజీనామా చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి సుహేలీ మెహతాతో పాటు ప‌లువురు జేడీయూ నాయకులను బీజేపీలో చేర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు.

Updated On 11 May 2023 4:08 AM GMT
Ehatv

Ehatv

Next Story