రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా బీజేపీతో కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి శుక్రవారం ప్రకటించారు. పార్టీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ తనకు అధికారం ఇచ్చారని చెప్పారు.

JDS Leader HD Kumaraswamy Declared That His Party Decided To Work Together With The BJP As An Opposition
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా బీజేపీ(BJP)తో కలిసి పనిచేయాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు జనతాదళ్ సెక్యులర్ (JDS) నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి(Karnataka Ex CM) హెచ్‌డి కుమారస్వామి(HD Kumaraswamy) శుక్రవారం ప్రకటించారు. పార్టీకి సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ(HD Devegowda) తనకు అధికారం ఇచ్చారని చెప్పారు.
2024 లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections)కు ముందు ఎన్‌డీఏ(NDA)తో జేడీఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. అయితే.. ఈ విషయమై గురువారం రాత్రి జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో జరిగిన చర్చపై అడిగిన ప్రశ్నకు.. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని అన్నారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశాని(legislature party meeting)కి దేవెగౌడ కూడా హాజరయ్యారు. బీజేపీ, జేడీఎస్‌లు ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని ఇప్పటికే అసెంబ్లీ లోపలా, బయటా చెప్పానని తెలిపారు. ఈరోజు ఉదయం కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ముందుకు వెళ్లాలి అని చర్చించుకున్నారని అన్నారు.
నేతలందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత.. పార్టీ సంస్థాగతంగా అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో 10 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేసి.. 31 జిల్లాల్లో ఈ (కాంగ్రెస్) ప్రభుత్వ అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో దేవెగౌడ సూచించారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చూద్దాం. పార్టీని నిర్వహించాలని సూచించారు. పార్టీకి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయమైనా తీసుకునే అధికారం.. దేవెగౌడ నాకు ఇచ్చారు. మేలో జరిగిన 224 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections)ల్లో కాంగ్రెస్(Congress)కు 135 సీట్లు రాగా, బీజేపీకి 66, జేడీఎస్‌కు 19 సీట్లు వచ్చాయి.
