పవిత్ర వైద్య వృత్తికి ఓ వైద్యుడు(Doctor) కళంకం తీసుకొచ్చాడు. తన దగ్గరికి వచ్చే యువకులను(Boys) లోబర్చుకొని వారితో హోమోసెక్స్‌లో(Homosex) పాల్గొంటున్నాడు. అనారోగ్యం కోసం వచ్చే యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని డాక్టర్ భార్యే ఫిర్యాదు చేసింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తన భర్త బారిన పడ్డ యువత జీవితాలను కాపాడాలంటూ వేడుకుంది.
పవిత్ర వైద్య వృత్తికి ఓ వైద్యుడు(Doctor) కళంకం తీసుకొచ్చాడు. తన దగ్గరికి వచ్చే యువకులను(Boys) లోబర్చుకొని వారితో హోమోసెక్స్‌లో(Homosex) పాల్గొంటున్నాడు. అనారోగ్యం కోసం వచ్చే యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని డాక్టర్ భార్యే ఫిర్యాదు చేసింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తన భర్త బారిన పడ్డ యువత జీవితాలను కాపాడాలంటూ వేడుకుంది. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ మౌలాలి(Moulali) నివాసి డా.జవ్వాద్ అలీ ఖాజాకు(Dr. Jawwad Ali Khaza) 2014లో ఓ మహిళతో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు ఇతనికి కట్నం కింద రూ.25 లక్షల నగదు, 30 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లయిన కొన్నిరోజులకు తనలో ఉన్న మృగజాతిని బయటపెట్టాడు. అదనపు కట్నం(Dowry) కోసం అత్తమామను వేధించాడు. భర్త వ్యవహారశైలిపై కూడా ఆమెకు పలుసార్లు అనుమానం కలిగింది. కుటుంబం, పిల్లల కోసం ఈ ప్రబుద్దుడిని భరిస్తూ వచ్చింది. గత ఏడాది 2023 ఇంటి నుంచి పారిపోయి హర్యానాలో సెటిలయ్యాడు. ఇంట్లోని సీసీ కెమెరాలను ఆపేసి మరీ పారిపోయాడు. ఇదే ఇంటి మీద ఉంటున్న విష్ణువర్ధన్‌రెడ్డి అనే విద్యార్థిని భర్త గురించి ఆరా తీసింది. ఆ తర్వాత కాసేపటికే విష్ణువర్ధన్‌రెడ్డి(Vishnuvardhan Reddy) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో ఆత్మహత్యకు గల కారణాలను లేఖలో విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించాడు. డాక్టర్ జవ్వాద్ తనను లైంగికంగా వేధించేవాడని సూసైడ్ నోట్ రాశాడు. దీనిపై కుషాయిగూడ పీఎస్‌లో కేసు నమోదుకాగా.. తనకున్న పరిచయాలతో కేసు నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత హర్యానా వెళ్లి డాక్టర్‌గా కొనసాగుతున్నాడు. అక్కడికి అనారోగ్యంతో వచ్చిన యువకులను లోబర్చుకోని స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నాడు. విషయం తెలుసుకున్న డాక్టర్ జవ్వాద్ భార్య మీడియాకు అతని గురించి వివరాలు వెల్లడించారు. అతనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటపెట్టింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో విచారణ చేయించి తన భర్తను కఠినంగా శిక్షించాలని, ఇతని వల్ల నరకం అనుభవిస్తున్న యువకులను కాపాడాలని కోరారు. తనకు, తన ఇద్దరు పిల్లలకు న్యాయం జరగాలని ఆమె విజ్ఞప్తి చేశారు.స