Jasprit Bumrah : దొరికనట్లే దొరికి.. చేతికొచ్చిన వికెట్‌ను కోల్పోయిన టీమిండియా..!
హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 3వ రోజు ఇంగ్లండ్(England) బ్యాటర్ బెన్ డకెట్ వికెట్ కోల్పోయినా.. కెప్టెన్ రోహిత్ శర్మకు(Rohit sharma) కేఎస్ భరత్ ఇచ్చిన సలహాతో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు(Jasprit Bumrah) చేతికి చిక్కిన వికెట్ కోల్పోయాడు.
హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో 3వ రోజు ఇంగ్లండ్(England) బ్యాటర్ బెన్ డకెట్ వికెట్ కోల్పోయినా.. కెప్టెన్ రోహిత్ శర్మకు(Rohit sharma) కేఎస్ భరత్ ఇచ్చిన సలహాతో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు(Jasprit Bumrah) చేతికి చిక్కిన వికెట్ కోల్పోయాడు. డకెట్‌ను(Duckett) బుమ్రా స్టంప్‌ల ముందు దొరికినట్లు స్పష్టంగా కనిపించింది. బలంగా అప్పీల్ చేసినా అంపైర్ దానిని తిరస్కరించాడు. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని భారత పేసర్ బూమ్రా ఆసక్తిగా ఉన్నాడు, అయితే వికెట్ కీపర్ బ్యాటర్ KS భరత్ కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు పరుగెత్తి బంతి లెగ్ సైడ్‌లో పడుతుందని సూచించాడు. భరత్ సూచనతో రోహిత్ థర్డ్ అంపైర్‌కు వెళ్లకుండా ఆటను కొనసాగించాడు. తర్వాత రివ్యూలో బెన్ డకెట్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు క్లియర్‌గా కనపడడంతో రోహిత్, బూమ్రా నోరెళ్లబెట్టారు.