మన దేశపు వీధుల్లో ( Indian street food ) ఎక్కువ ఫేమస్ అయిన పానీపూరీని ఇద్దరు నేతలు తిన్నారు. అయితే రెండు పానీపూరీలు తిన్న కిషిదా మరొకటి అడిగి వేయించుకుని తిన్నారు. ఫ్రైడ్ ఇడ్లీ (fried idlis) తినడంతో పాటు మామిడికాయల గుజ్జు జ్యూస్ , లస్సీ తాగారు.
పానీ పూరి అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. ఒక్కటో రెండో తినేసి ఆపేద్దామంటే ....కుదరని పని ..ఒక్క పట్టు పట్టనిదే తిన్నట్టుగా ఉండదు . వినడానికి సరదా ఉన్న ఇది అందరికి తెలిసిన విషయమే. ... అయితే దీనికి రెండు దేశాల నేతలు మినాహాయింపేమి కాదని తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏంటీ అని ఆలోచిస్తున్నారా ? అదేనండి మన ప్రధాని మోదీ ...జపాన్ ప్రధాని వీరిద్దరు కూడా సరదాగా పానీ పూరీ ( pani puri)టేస్ట్ ఎంజాయ్ చేశారు . అయితే జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా ( Fumio Kishida)కి మన పానీ పూరి టేస్ట్ చాలా నచ్చినట్టు ఉంది ..అందుకే మరి మరి అడిగి ఇంకొకటి వేయించుకున్నారట. మన ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా రాష్ట్రపతి భవన్ వెనక ఉన్న సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని బుద్ధ జయంతి పార్క్( Buddha Jayanti Park )లో కాసేపు వన విహారం చేశారు. గౌతమ బుద్ధుని 2500వ జయంతిని పురస్కరించుకుని ....పార్క్ లోని బుద్దుని ప్రతిమకు నేతలు నివాళులర్పించారు
అనంతరం పార్క్ లో ఏర్పాటు చేసిన స్టాల్ లో వివిధ రకాల భారతీయ తినుబండరాలను కిషిదా రుచి చూసారు . మన దేశపు వీధుల్లో ( Indian street food ) ఎక్కువ ఫేమస్ అయిన పానీపూరీని ఇద్దరు నేతలు తిన్నారు. అయితే రెండు పానీపూరీలు తిన్న కిషిదా మరొకటి అడిగి వేయించుకుని తిన్నారు. ఫ్రైడ్ ఇడ్లీ (fried idlis) తినడంతో పాటు మామిడికాయల గుజ్జు జ్యూస్ , లస్సీ తాగారు. ఆ తర్వాత కాసేపు అక్కడే ఉన్న బెంచ్ పై కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాయ్ తాగారు .
రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్ ప్రధానమంత్రి ( Japan PM )ప్యుమియో కిషిదా సోమవారం ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ -జపాన్ ల మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఇద్దరు ప్రధానులు ప్రతిభ పునారు. వీటితో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, సుస్థిర , స్వేచ్చాయుత వాతావరణం ఉండేలా ...ద్వైపాక్షిక చర్చలు సాగించినట్లు ఇద్దరు నేతలు ప్రకటించారు.