✕
విశ్వసుందరి పోటీల్లో (Miss Universe Competions) పాల్గొనాలంటే మోడల్స్ (Models) ఎలా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. పోటీల్లో పాల్గొనే భామలు, సన్నగా నాజుకుగా ఉండాలని, కందిరీగలాంటి నడుము ఉండాలని భావిస్తారు. జీరో సైజ్ (Zero Size) కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నాకు ఇవేవీ లేవు, ప్లస్ సైజ్ (Plus Size) ఉన్నా వరల్డ్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటానంటూ దూసుకొచ్చింది ఓ నేపాలి (Nepal) బొద్దుగుమ్మ.

x
jan garret-compressed
-
- విశ్వసుందరి పోటీల్లో (Miss Universe Competions) పాల్గొనాలంటే మోడల్స్ (Models) ఎలా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. పోటీల్లో పాల్గొనే భామలు, సన్నగా నాజుకుగా ఉండాలని, కందిరీగలాంటి నడుము ఉండాలని భావిస్తారు. జీరో సైజ్ (Zero Size) కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నాకు ఇవేవీ లేవు, ప్లస్ సైజ్ (Plus Size) ఉన్నా వరల్డ్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంటానంటూ దూసుకొచ్చింది ఓ నేపాలి (Nepal) బొద్దుగుమ్మ.
-
- ప్లస్ సైజుతో విశ్వసుందరి పోటీల్లో పాల్గొని రికార్డ్ సొంతం చేసుకుంది. మిస్ యూనివర్స్-2023 (Miss Universe-2023)లో ప్లస్ సైజ్ మోడల్‌గా జేన్ దీపికా గారెట్ (Jane Garrett) జీరో సైజ్ మోడల్స్‌కు సవాళ్లు విసిరింది. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలంటే జీరో సైజ్ ఉడాలి, మంచి హైట్, నాజుకైన పర్సనాలిటీలు ఉండాలంటారు. ఇవన్నీ అక్కర్లేదంటోంది ఈ నేపాలీ బొద్దుగుమ్మ. ఈ పోటీల్లో ట్రాన్స్జెండర్ల (TransGenders) సహా ప్లస్ సైజ్ మోడల్స్ కూడా పాల్గొన్నారు.
-
- నేపాల్‌కు ప్రతినిధ్యం వహిస్తున్న జేన్ దీపికా కారెట్ ప్లస్ సైజ్ బాడీతో చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ (Mega Event)లో జీరో సైజ్ మోడల్స్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జేన్ దీపికా ర్యాంప్‌పై క్యాట్ వాక్ (Cat Walk) చేస్తుంటే రెప్పార్పకుండా చూశారట నిర్వాహకులు. తన స్టైల్, స్మైల్, పర్ఫార్మెన్స్తో అందరినీ ఆశ్చర్యపరిచిందట. ఈ ఈవెంట్లో పాల్గొన్న మొదటి ప్లస్ సైజ్ మోడల్‌గా జేన్ దీపికా నిలించింది. తనతో పోటీపడుతున్న దాదాపు 20 మందిని ఓడించింది.
-
- ఈ సందర్భంగా తను చేసిన వ్యాఖ్యలు కూడా అందరినీ ఆలోచింపచేశాయి. అందానికి సైజు (Size) ముఖ్యం కాదని, అలాటి ఆలోచనలను మార్చుకోవాలని ఫ్యాషన్ (Fashion) ప్రపంచాన్ని ఆమె కోరింది. మహిళల్లో హార్మొన్లు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయని, హార్మోన్ల ఇమ్బ్యాలెన్స్ (Harmonal Imbalance)వల్ల తాను బరువు పెరిగానని, ఇది తన బలహీనత కాకూడదనే పోటీల్లో పాల్గొన్నానని చెప్పింది. తన వ్యాఖ్యలపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రతిష్టాతక విశ్వసుందరి కిరీటం ఈ సారి నికరాగ్వా(Nicaraguan) భామ గెల్చుకుంది.
-
- 72వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను నికరాగ్వాకు చెందిన ముద్దుగుమ్మ షెన్నిస్ పలాసియోస్ (Sheynnis Palacios) కైవసం చేసుకుంది. రన్నరప్ (RunnerUp)గా థాయ్‌లాండ్ (Thailand) కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ (Anntonia Porsild) నిలిచింది. రెండో రన్నరప్‌గా ఆస్ట్రేలియాకు (Australia) చెందిన మోరయా విల్సన్ (Moraya Wilson) నిలిచింది. ఈ పోటీల్లో 84 దేశాలకు మోడల్స్ పాల్గొన్నారు. భారత్ తరపున ప్రాతినిథ్యం వహించిన శ్వేతా శార్దా (Shweta Sharda) టాప్ 20లో నిలిచింది.

Ehatv
Next Story