Pawan Kalyan-Kishan Reddy : పవన్‌తో కిషన్ రెడ్డి భేటీ
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) తెలంగాణ బీజేపీ(TS BJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) బుధవారం భేటీ అయ్యారు. కిషన్ రెడ్డి వెంట రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్(Dr.K Lakshman) తదితరులు ఉన్నారు. ఈ భేటీలో బీజేపీ నేతలు తెలంగాణలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాల్సిందిగా జనసేనానిని కోరినట్లు సమాచారం.
జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) తెలంగాణ బీజేపీ(TS BJP) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) బుధవారం భేటీ అయ్యారు. కిషన్ రెడ్డి వెంట రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్(Dr.K Lakshman) తదితరులు ఉన్నారు. ఈ భేటీలో బీజేపీ నేతలు తెలంగాణలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాల్సిందిగా జనసేనానిని కోరినట్లు సమాచారం. దీనిపై పవన్..
మద్దతు విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వారికి చెప్పినట్లు తెలుస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ(BJP) నేతలు పవన్ కళ్యాణ్ మద్దతును కోరారు. ప్రస్తుతం జనసేన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో(NDA) భాగస్వామిగా ఉంది. ఆ చొరవతోనే తెలంగాణలో జనసేన పోటీ చేయకుండా తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది.
ఇదిలావుంటే.. ఏపీలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన టీడీపీతో(TDP) పొత్తుకు సిద్ధమైంది. ఇప్పటికే ఇరు పార్టీలు ఈ విషయమై ప్రకటనలు కూడా చేశాయి. పవన్ బీజేపీని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుండగా.. బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.