జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్‌లో బయలుదేరి వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం తెలంగాణ బీజేపీ(TS BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా ఢిల్లీకి వెళ్లనున్న‌ట్లు స‌మాచారం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. నేడు, రేపు ఢిల్లీ బీజేపీ పెద్దలు అమిత్ షా(Amit Shah), నడ్డాతో(Nadda) ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ భేటీ కానున్న‌ట్లు తెలుస్తుంది.

జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్‌లో బయలుదేరి వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇవాళ మ‌ధ్యాహ్నం తెలంగాణ బీజేపీ(TS BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా ఢిల్లీకి వెళ్లనున్న‌ట్లు స‌మాచారం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. నేడు, రేపు ఢిల్లీ బీజేపీ పెద్దలు అమిత్ షా(Amit Shah), నడ్డాతో(Nadda) ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ భేటీ కానున్న‌ట్లు తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికలకు టీడీపీ(TDP) దూరంగా ఉండ‌నుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో.. జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేయాలి.. లేదంటే బీజేపీతో పొత్తు ద్వారా బ‌రిలో దిగ‌డ‌మా..? అదికాకుంటే.. పోటీకి దూరంగా ఉండి బీజేపీకి మ‌ద్ద‌తు తెలప‌డ‌మా అనే విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌రుప‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఏ విష‌య‌మైన‌దీ.. రేపు సాయంత్రానికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్న‌ది.

ఇదిలావుంటే.. జనసేన ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సైతం ప‌లువురు బీజేపీ నేతలు వ్యక్తపరిచారు. ఈ క్ర‌మంలో ఛీప్ కిషన్‌రెడ్డి, సీనియ‌ర్ నేత‌ లక్ష్మణ్‌లు ఇటీవల పవన్‌కల్యాణ్‌ను కలిశారు.

Updated On 25 Oct 2023 4:25 AM GMT
Ehatv

Ehatv

Next Story