కొల్లాపూర్‌(Kollapur) నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా(Independent) బరిలో దిగిన బర్రెలక్క(Barrelakka) అలియాస్‌ శిరీషకు(Sirisha) అన్ని వర్గాల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. నిరుద్యోగులు, యువత ఆమె వైపు నిలబడ్డారు. మాజీ బ్యూరోక్రాట్లు(Bureaucrats), రిటైర్డ్‌ ఉద్యోగులు ఆమెకు బాసటగా నిలిచారు. రాజకీయ నేతల మద్దతు కూడా ఆమెకు లభిస్తోంది. ఇప్పుడు జానకీపురం(Janakipuram) సర్పంచ్ నవ్య(Navya) కూడా బర్రెలక్కకు మద్దతు తెలపటమే కాకుండా ఆమె తరపున ప్రచారం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఆ మధ్యన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సర్పంచ్‌ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలపడం ఆసక్తికర పరిణామం!

కొల్లాపూర్‌(Kollapur) నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా(Independent) బరిలో దిగిన బర్రెలక్క(Barrelakka) అలియాస్‌ శిరీషకు(Sirisha) అన్ని వర్గాల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. నిరుద్యోగులు, యువత ఆమె వైపు నిలబడ్డారు. మాజీ బ్యూరోక్రాట్లు(Bureaucrats), రిటైర్డ్‌ ఉద్యోగులు ఆమెకు బాసటగా నిలిచారు. రాజకీయ నేతల మద్దతు కూడా ఆమెకు లభిస్తోంది. ఇప్పుడు జానకీపురం(Janakipuram) సర్పంచ్ నవ్య(Navya) కూడా బర్రెలక్కకు మద్దతు తెలపటమే కాకుండా ఆమె తరపున ప్రచారం నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఆ మధ్యన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సర్పంచ్‌ నవ్య కూడా బర్రెలక్కకు మద్దతు తెలపడం ఆసక్తికర పరిణామం! స్టేషన్‌ఘన్‌పూర్‌(Station Ghanpur) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ నవ్య ఆరోపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు రాజయ్య బరిలో లేకున్నా ఆమె స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అధికారులు కేటాయించిన వజ్రం గుర్తుతో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే, తనలాగే బర్రెలక్క కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు కాబట్టి సాటి మహిళగా ఆమెకు మద్దతు తెలుపుతున్నానని నవ్య చెబుతున్నారు. కేవలం మద్దతు ప్రకటించి ఊరుకోకుండా శిరీష తరపున ప్రచారం(Campaign) చేయడానికి అక్కడికి వెళ్లారు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం యువతకు ఉందన్నారు నవ్య. కేవలం యువత మాత్రమే కాదని, ఉద్యోగులు, మేధావులు, అభివృద్ధిని ఆంకాక్షించే వారు, ప్రతి ఒక్కరు శిరీషకు సపోర్ట్‌ చేసి ఆమెకు భారీ విజయాన్ని అందించాలని నవ్య కోరారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, నవ్య కొల్లాపూర్‌కు రావడం శిరీషకు సుతరాము ఇష్టం లేనట్టుగా ఉంది. అందుకే నవ్యను కలవడానికి కూడా శిరీష ఇష్టపడలేదు. నవ్య అక్కడికి వచ్చే సమయానికి ముందుగానే శిరీష మరో చోటికి ప్రచారానికి వెళ్లారు. శిరీష కోసం కాసేపు ఎదురుచూసి వెనక్కి వచ్చేశారు నవ్య.
శిరీష తెలివైన అమ్మాయే! ఎవరు ఎందుకు మద్దతు తెలుపుతున్నారో తెలుసుకోలేనంత అమాయకురాలైతే కాదు! నిజానికి శిరీష పోరాడుతున్నదే అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీపైన! బీఆర్‌ఎస్‌ పాలనలో అనుకున్నంతగా ఉద్యోగ నోటిఫికేషన్లు() రాలేదన్న అసంతృప్తి యువతలో ఉంది. శిరీష కూడా ఈ అంశాన్నే ఎజెండా తీసుకుని పోరాటం చేస్తున్నారు. ఆమె చేస్తున్న పోరాటం నచ్చే చాలా మంది ఆమెకు బాసటగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కండువా వేసుకుని వచ్చిన నవ్యతో కలిసి ప్రచారం నిర్వహిస్తే మొదటికే మోసం రావచ్చని శిరీష అనుకున్నారు. అధికారపక్షంపై అసంతృప్తితో ఉన్నవారంతా శిరీష వెంట ఉన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ప్రచారం నిర్వహిస్తే ఇంతకాలం తనకు చేదోడువాదోడుగా నిలిచినవారు దూరం అవుతారని గ్రహించిన శిరీష నవ్యకు దూరంగా ఉన్నారు.

Updated On 24 Nov 2023 4:08 AM GMT
Ehatv

Ehatv

Next Story