త్వరలో బీజేపీలో జనసేన విలీనం కానుందని మాజీ అధికారి పీవీఎస్ శర్మ ఎక్స్‌వేదికగా ప్రకటించారు.
త్వరలో బీజేపీలో జనసేన విలీనం కానుందని మాజీ అధికారి పీవీఎస్ శర్మ ఎక్స్‌వేదికగా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత బీజేపీ-జనసేన విలీనమయ్యే అవకాశం ఉందని.. పండుగ సమయంలోనే విలీనంపై ప్రకటన వెలువడుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సఖ్యతగా లేరని అన్నారు. అందుకే ఈ చీలికకు కారణమవుతుందన్నారు. రాష్ట్రంలో పవన్ లోటును ఆయన సోదరుడు భర్తీ చేస్తారన్నారు. పవన్ ఏపీ బీజేపీ చీఫ్‌గా, కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. కాగా పవన్ కేంద్ర మంత్రి కానున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ వ్యూహంలో భాగంగానే నాగబాబు(nagababu)కు ఈ పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది. నాగబాబును రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకొని తాను కేంద్రమంత్రిగా వెళ్లాలనుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఈ మధ్య కాలంలో జాతీయ అంశాలపై పదేపదే మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై తన వాదనను వినిపిస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడడంతో ఆయనకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఉండే కంటే ఢిల్లీలో ఉంటేనే బాగుంటుందని సమాచారం. ఎన్నికల సమయంలో టిక్కెట్లు, సీట్ల సర్దుబాటు సమయంలో తనను బీజేపీ పెద్దలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారని పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు వచ్చిన జాతీయస్థాయి ఇమేజ్‌తో తమిళనాడు, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్న ఎన్డీఏ బాగస్వామి పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.