జమ్ములోని(Jammu) సుప్రసిద్ధ శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి(Vaishodevi temple) ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. సోమవారం వరకు 93.50 లక్షల మంది అమ్మవారిని దర్శకున్నారని అధికారులు తెలిపారు.

జమ్ములోని(Jammu) సుప్రసిద్ధ శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయానికి(Vaishodevi temple) ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. సోమవారం వరకు 93.50 లక్షల మంది అమ్మవారిని దర్శకున్నారని అధికారులు తెలిపారు. శ్రీ మాతా వైష్ణోదేవి అమ్మవారిని ఇంత భారీగా భక్తులు దర్శించుకోవడం పదేళ్లలో ఇదే మొదటిసారి అని వారు చెప్పారు. సరిగ్గా పదేళ్ల కిందట 2013లో 93.23 లక్షల మంది వైష్ణోదేవి అమ్మవారిని దర్శించకున్నారు. అంతకుముందు 2011లో 1,01,15,647 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే, 2012లో 1,04,09,569 మంది భక్తులు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. ప్రతి రోజూ 37-44 వేల మంది భక్తులు పుణ్య క్షేత్రానికి వచ్చి వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తుల కోసం మాతా వైష్ణోదేవి భవన్, దుర్గా భవన్‌లో స్కై వాక్ వంటి సౌకర్యాలు కల్పించారు.

Updated On 27 Dec 2023 2:51 AM GMT
Ehatv

Ehatv

Next Story