జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌లో ఈరోజు ఉదయం 7:22 గంటలకు భూకంపం
జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌లో ఈరోజు ఉదయం 7:22 గంటలకు భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీయడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా అంచనా వేశారు. ప్రాణనష్టం గురించి ఎటువంటి నివేదికలు లేవు.
గత కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో పదే పదే భూకంపాలు వస్తున్నాయి. మే 1వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదైంది. బుధవారం రాత్రి 1:33 గంటలకు భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం నివేదించింది. భూకంపం వల్ల ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం గురించి ఎలాంటి నివేదికలు లేవు. ఏప్రిల్ 19 ఉదయం జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్, లడఖ్‌లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 3.0గా నమోదైంది. ఏప్రిల్ 18 రాత్రి, జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో కూడా భూకంపం సంభవించింది, ఇది రిక్టర్ స్కేల్‌పై 4.0 గా నమోదైంది. జమ్మూకశ్మీర్‌లో తరచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.