జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది.

జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్‌కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌లకు చేరుకోవడం ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా మంది అనుభవజ్ఞులు కూడా ఎన్నికల బ‌రిలో నిలిచారు. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ.. బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీలో ఉండగా.. కిష్త్వార్ నుంచి షాగున్ పరిహార్‌ను బ‌రిలో ఉంచి బీజేపీ స‌వాల్ విసిరింది. షాగున్ పరిహార్ ఓటు వేయడానికి ముందు ఆమె నివాసంలో ప్రార్థనలు చేశారు. షగుణ్ పరిహార్ తండ్రి అజిత్ పరిహార్, మామ అనిల్ పరిహార్‌లను 2018 నవంబర్‌లో ఉగ్రవాదులు కాల్చి చంపారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలపై రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లలో కూడా ఉత్కంఠ నెలకొంది. తొలి దశలో ఓటింగ్ జరగనున్న స్థానాల్లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి, పీడీపీతో పాటు పలు ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికలను ఆసక్తికరంగా మార్చారు. కుల్గాం స్థానం నుంచి సీపీఐఎం మహమ్మద్ యూసుఫ్ తరిగామి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి నజీర్ అహ్మద్ లావే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి మహ్మద్ అమీన్ దార్ బరిలోకి దిగారు.

కిష్త్వార్‌లో ఓటు వేసిన అనంతరం ఓ ఓటరు మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంతం కావాలని మేము కోరుకుంటున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేం ఓటు వేసాం. ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరుతున్నాం అన్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story