జమిలి ఎన్నికలపై(Jamilli Elections) మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath kovindh) నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ(Committee) పరిచయ సమావేశం శనివారం ఇక్కడ జరగనుంది. ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై ఈ సమావేశం లో చర్చిస్తారని తెలుస్తోంది.

జమిలి ఎన్నికలపై(Jamilli Elections) మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ramnath kovindh) నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ(Committee) పరిచయ సమావేశం శనివారం ఇక్కడ జరగనుంది. ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై ఈ సమావేశం లో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 23న కమిటీ సమావేశం జరుగుతుందని కోవిద్ ఇటీవల ఒడిశాలో చెప్పిన విషయం తెలిసిందే. లోక్‌సభతో పాటుగా రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై పరిశీలన జరిపి, వీలయినంత త్వర లో సిఫార్సులు చేసేందకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న కోవింద్ నే తృత్వంలో ఎనిమిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మాజీ మంత్రి గులాబ్ నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ అధ్యక్షుడు ఎన్‌కె సింగ్ , లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సి కశ్యప్, సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మాజీ చీఫ్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉన్నారు.

లోక్‌సభలో కాం గ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని కూడా కమిటీలో సభ్యుడుగా ఉన్నప్పటికీ తాను కమిటీలో ఉండబోవడం లేదని ఆయన ఇటీవల హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కాగా ఈ సమావేశం కేవలం పరిచయ సమావేశం మాత్రమేనని, ఈ సమావేశంలో తమకిచ్చి న అంశంపై ముందుకు వెళ్లడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌పై కమిటీ చరిస్తుందని కమిటీ సన్నిహిత వర్గాలు తెలియజేశారు. కమిటీ విధి విధానాల గురించి న్యాయశాఖ అధికారులు ఇదివరకే కోవింద్‌కు వివరించారు. అంతేకాకుండా అమిత్ షా, కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉన్న న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్‌లు కోవింద్‌ను కలిశారు.

Updated On 23 Sep 2023 7:57 AM GMT
Ehatv

Ehatv

Next Story