బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ సిబ్బంది కరెంట్ కట్ చేయడానికి వెళ్లారు. వారిపై మహిళలు కర్రలతో దాడి చేశారు. బూతులు తిట్టారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్(Madya Pradesh)లోని రాజ్‌గఢ్ జిల్లా(Rajgarh District)లో జరిగింది. జమిల ఖటూర్ అనే మహిళ ఫ్యామిలీ ఈ దాష్టికానికి పాల్పడింది.
బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ సిబ్బంది కరెంట్ కట్ చేయడానికి వెళ్లారు. వారిపై మహిళలు కర్రలతో దాడి చేశారు. బూతులు తిట్టారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్(Madya Pradesh)లోని రాజ్‌గఢ్ జిల్లా(Rajgarh District)లో జరిగింది. జమిల ఖటూర్ అనే మహిళ ఫ్యామిలీ ఈ దాష్టికానికి పాల్పడింది. జమిల ఖటూన్ కుటుంబం విద్యుత్ చౌర్యానికి పాల్పడుతుండటంతో విజిలెన్స్ అధికారులు(Vigilance Officers)మొన్న జనవరి 29వ తేదీన ఆమెకు 98,207 రూపాయల జరిమానా విధించారు. ఫిబ్రవరి 25వ తేదీలోపుగా బిల్లు చెల్లించాలని ఆదేశించారు. దాంతో జమిల ఫ్యామిలీ ఓ 40 వేల రూపాయలు చెల్లించింది. మిగతా సొమ్మును చెల్లించమంటే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నది. దాంతో అధికారులు ఆమెకు మరికొంత గడువు ఇచ్చారు. అది కూడా పూర్తి కావడంతో కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని నోటీసులు పంపారు. ఆ నోటీసులను కూడా లైట్ తీసుకుంది జమిల ఫ్యామిలీ!దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూనియర్ ఇంజనీర్ తన సిబ్బందితో కలిసి కరెంట్ కట్ చేయడానికి ఆమె ఇంటికి వెళ్లారు. వారిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడింది జమిలా. అంతే కాకుండా తన కూతురు, అల్లుడితో కలిసి వారిపై దాడికి దిగింది. బూతులు తిడితూ కర్రలతో కొట్టారు. వారి నుంచ ఎలాగోలా తప్పించుకున్న విద్యుత్ సిబ్బంది పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేవారు.