Jairam Ramesh : ప్రధాని మోదీ దేనికి భయపడుతున్నారు.?
ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ(Rahul gandhi) తొలిసారి బుధవారం సభలో మాట్లాడారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై(Motion Of no Confidence) జరుగుతున్న చర్చలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎంపీగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ గాంధీ(Rahul gandhi) తొలిసారి బుధవారం సభలో మాట్లాడారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై(Motion Of no Confidence) జరుగుతున్న చర్చలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే రాహుల్ ప్రసంగాన్ని సరిగా చూపించలేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్(Jairam Ramesh) వేదికగా బీజేపీని(BJP) ప్రశ్నించారు.
జైరామ్ రమేష్ ట్వీట్‌లో(Twitter).. అన్యాయమైన అనర్హత వేటు తర్వాత పార్లమెంట్‌కు తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా తన మొదటి ప్రసంగం చేశారు. రాహుల్ మధ్యాహ్నం 12:09 నుంచి 12:46 వరకు అంటే 37 నిమిషాలు మాట్లాడారు. అందులో రాజ్యసభ టీవీ కెమెరా ఆయన ప్రసంగాన్ని కేవలం 14 నిమిషాల 37 సెకన్లు మాత్రమే చూపించిందని.. అది రాహుల్ మాట్లాడిన సమయంలో 40% కంటే తక్కువ సమయమని.. ప్రధాని మోదీ దేనికి భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.
మరో ట్వీట్‌లో.. ప్రభుత్వం మరింత దిగజారుతుంది.. రాహుల్ గాంధీ మణిపూర్‌పై 15 నిమిషాల 42 సెకన్ల పాటు మాట్లాడారు. ఈ సమయంలో సంసద్ టీవీ కెమెరా స్పీకర్ ఓం బిర్లాపై 11 నిమిషాల 08 సెకన్లు ( 71% శాతం) ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ మణిపూర్‌పై మాట్లాడేటప్పుడు కేవలం 4 నిమిషాల 34 సెకన్లు మాత్రమే వీడియోలో ఉన్నారని పేర్కొన్నారు.