ఎన్నికల సంవత్సరంలో ఎన్నికల సంఘంపై నియంత్రణ సాధించాలని మోదీ(PM Modi) ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్(Congress) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) శుక్రవారం నాడు 2012లో అప్పటి బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ(Lal Krishna Advani) ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కు రాసిన లేఖను గుర్తుచేస్తూ.. పక్షపాత ముద్రను తొలగించేందుకు రాజ్యాంగ సంస్థల నియామకాలు ద్వైపాక్షిక పద్ధతిలో జరగాలని తాను కూడా చెప్పానని అన్నారు. […]
ఎన్నికల సంవత్సరంలో ఎన్నికల సంఘంపై నియంత్రణ సాధించాలని మోదీ(PM Modi) ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్(Congress) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) శుక్రవారం నాడు 2012లో అప్పటి బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ(Lal Krishna Advani) ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)
కు రాసిన లేఖను గుర్తుచేస్తూ.. పక్షపాత ముద్రను తొలగించేందుకు రాజ్యాంగ సంస్థల నియామకాలు ద్వైపాక్షిక పద్ధతిలో జరగాలని తాను కూడా చెప్పానని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషన, ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం ప్యానెల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో క్యాబినెట్ మంత్రిని నియమించాలని కోరుతూ వివాదాస్పద బిల్లును కేంద్రం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
జైరాం రమేష్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్ష నేత, న్యాయశాఖ మంత్రితో కూడిన ఐదుగురు సభ్యుల ప్యానెల్ లేదా కొలీజియంతో సీఈసీ, ఇతర సభ్యులను నియమించాలని అద్వానీ లేఖలో కోరారు. ప్రధాని సలహా మేరకు మాత్రమే ఎన్నికల సంఘం సభ్యులను రాష్ట్రపతి నియమిస్తున్న ప్రస్తుత విధానం.. ప్రజల్లో విశ్వాసం కలిగించడం లేదని 2012 జూన్ 2న అద్వానీ లేఖ రాశారు. ఆ సమయంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని మార్చేందుకు తాను సిద్ధమని మన్మోహన్ సింగ్(Manmohan Singh)
తెలిపారు.
సంస్కరణలపై సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా రాసిన లేఖపై మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, రాజీనామా, తొలగింపు ప్రక్రియను ప్రభుత్వమే నిర్దేశించిందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా కాలంగా ఉనికిలో ఉంది. ప్రక్రియలో ఏదైనా మార్పు చేయాలంటే ఇతర రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు అవసరమని ఆయన చెప్పారు. అవసరమైతే.. దీనిని ఎన్నికల సంస్కరణల ఎజెండాలో భాగంగా తీసుకోవచ్చని అన్నారు.
నరేంద్ర మోదీ(Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు.. అద్వానీ ప్రతిపాదించిన తీర్మానానికి వ్యతిరేకం కావడమే కాకుండా.. ఈ ఏడాది మార్చి 2న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. ఎన్నికలు జరుగనున్న సంవత్సరంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య.. ఎన్నికల కమిషన్‌పై నియంత్రణ సాధించడం.. నియంత్రణ కోరుకోవడమేనని ఆయన అన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన బిల్లు ప్రకారం.. సీఈసీని ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఎంపిక చేస్తుంది. ఇందులో ప్రధానమంత్రి, ఇద్దరు సభ్యులు-లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా సభలో అతిపెద్ద పార్టీ నాయకుడు.. ప్రధానమంత్రి నామినేట్ చేసిన క్యాబినెట్ మంత్రి ఉంటారు.