Diya Kumari : ఎవరీ దియాకుమారి? ఆమె నేపథ్యం ఎట్టిది?
అనేకానేక తర్జనభర్జనల తర్వాత, అనేకానేక వడపోతల తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్(Rajasthan) ముఖ్యమంత్రి ఎంపిక జరిగింది. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన భజన్‌లాల్ శర్మను(Bhajanlal Sharma) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులు. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి(Diya Kumari), ప్రేమ్‌చంద్ బైర్వాను నియమించారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు. డిప్యూటీ సీఎం దియా కుమారి రాజకుటుంబీకురాలు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా(Bairva Premchand) దళిత సామాజికవర్గానికి చెందినవారు.
అనేకానేక తర్జనభర్జనల తర్వాత, అనేకానేక వడపోతల తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్(Rajasthan) ముఖ్యమంత్రి ఎంపిక జరిగింది. తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన భజన్‌లాల్ శర్మను(Bhajanlal Sharma) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులు. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి(Diya Kumari), ప్రేమ్‌చంద్ బైర్వాను నియమించారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు. డిప్యూటీ సీఎం దియా కుమారి రాజకుటుంబీకురాలు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా(Bairva Premchand) దళిత సామాజికవర్గానికి చెందినవారు. నిజానికి దియాకుమారి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు.
ఇప్పుడు భజన్‌లాల్ శర్మ కంటే దియా కుమారి ఎవరన్న ఆసక్తే చాలా మందిలో ఉంది. ఆమె జైపూర్(Jaipur) రాజసంస్థానం వారసురాలు. రాజాకుటుంబంలో 1971, జనవరి 30న దియాకుమారి జన్మించారు. ఆమె తాత మాన్‌సింగ్-II(Thatha Mansingh II) బ్రిటిష్ కాలంలో జైపూర్‌ను పాలించిన చివరి మహారాజు. దియాకుమారి తండ్రి సవాయ్ భవాని సింగ్ బ్రిగేడియర్ . 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ఈయన కనబర్చిన ధైర్య సాహసాలు అసమాన్యం. అందుకే ఆయనకు మహా వీర్ చక్ర అవార్డు(Mahaveer Chakra Award) లభించింది. దియాకుమారి ప్రాథమిక విద్య అంతా మహారాణి గాయత్రి దేవి స్కూల్‌లో(Queen Gayatri devi School) సాగింది. ఉన్నత విద్యను జైపూర్‌లోని మహారాణి కాలేజీలో అభ్యసించారు.
నరేంద్రసింగ్‌ను పెళ్లి చేసుకున్న దియాకుమారికి ముగ్గురు సంతానం. వీరిలో ఒకరు పద్మనాభ్ సింగ్ . ఈయనే జైపూర్ మహారాజుగా కొనసాగుతున్నారు. నరేంద్రసింగ్‌కు 2018లో విడాకులు ఇచ్చారు దియాకుమారి. అంతకుముందే, అంటే 2013లోనే దియా కుమారి పాలిటిక్స్‌లోకి వచ్చారు. రాజస్తాన్‌లోని సవాయ్ మాధోపూర్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయ్యాక ఆమె గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారు. 2019 ఎన్నికల్లో రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు.
ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై 71,368 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు దియా కుమారి. రాజకీయాలకు అతీతంగా రెండు పాఠశాలలు, ట్రస్టులతో పాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు దియాకుమారి. మహారాజా సవాయి మాన్ సింగ్ II మ్యూజియం ట్రస్ట్, జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్ట్‌లను కూడా దియా పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్‌ను కూడా నడుపుతున్నారు దియా కుమారి. ఈ ఫౌండేషన్ ద్వారా మహిళలకు, అమ్మాయిలకు వృత్తిపరమైన శిక్షణ, విద్య, జీవనోపాధి కల్పనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తున్నారు.
అంతేకాకుండా మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించారు. ఆమె చేసిన సేవలకు గానూ జైపూర్‌లోని అమిటీ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. వీటితో పాటు దియాకుమారికి రాణివాసపు ఆడంబరాలు, అట్టహాసాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె రాజవైభోగాన్ని అనుభవిస్తుంటారు. ఆమె నివసించే ప్యాలెస్ మామూలుగా ఉండదు. గాయత్రి దేవి తెలుసుగా! టాప్ టెన్ అందగత్తెల్లో గాయత్రి కూడా ఒకరన్న విషయం కూడా తెలిసిందే కదా! అప్పట్లో జైపూర్ మహారాణి అమె! ఆమె ప్రస్తావన ఎందుకంటే దియాకుమారికి ఆమె సవతి మామ్మ అవుతారు కాబట్టి! గాయత్రిదేవి అంత అందగత్తె కాకపోయినా దియాకుమారి కూడా అందంగానే ఉంటారు.