జైపూర్ మేయర్ మునేష్ గుర్జార్ భర్త లంచం తీసుకుంటూ దొరికిపోయారు. దీంతో రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మేయర్‌ను ప‌ద‌వి నుంచి తొలగించింది.

జైపూర్ మేయర్ మునేష్ గుర్జార్(Munesh Gurjar) భర్త లంచం తీసుకుంటూ దొరికిపోయారు. దీంతో రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మేయర్‌ను ప‌ద‌వి నుంచి తొలగించింది. లంచం తీసుకుంటూ భర్త పట్టుబడటంతో అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నిజానికి భర్త లంచం తీసుకున్న కేసులో మేయర్ కూడా విచారణలో ఉన్నందున ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

జైపూర్ హెరిటేజ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేష్ గుర్జార్‌(Jaipur Heritage Municipal Corporation Mayor Munesh Gurjar)ను సస్పెండ్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం(Rajasthan Govt) అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ భర్త సుశీల్ గుర్జార్‌(Sushil Gurjar)ను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పట్టా మంజూరుకు బదులుగా రూ.2 లక్షలు లంచం తీసుకున్న కేసులో అరెస్టు చేసింది. మునిసిపల్ బాడీ సీటు-వార్డ్ నంబర్ 43 నుండి గెలిచి మేయర్‌గా ఉన్న మునేష్ గుర్జార్‌ను సస్పెండ్ చేసింది.

మేయర్ సొంత నివాసంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ సమయంలో మేయర్ కూడా అక్కడే ఉన్నారు. మేయ‌ర్‌ నివాసం నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతిలో మేయర్‌కు కూడా ప్రమేయం ఉండవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

సుశీల్ గుర్జార్‌తో పాటు మరో ఇద్దరిని కూడా ఏసీబీ అరెస్టు చేసింది. వారి విచారణ రెండు రోజులుగా కొనసాగుతోంది. సుశీల్ గుర్జార్ తన సహచరులు నారాయణ్ సింగ్(Narayan Singh), అనిల్ దూబే(Anil Dubey) ద్వారా భూమి లీజు దరఖాస్తును ముందస్తుగా ఆమోదించడానికి ఫిర్యాదుదారు నుండి రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని ఏసీబీకి దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు అధికారులు వల వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Updated On 5 Aug 2023 11:07 PM GMT
Yagnik

Yagnik

Next Story