గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ(Gangster Mukhtar Ansari) గుండెపోటుతో(Heart attcak) చనిపోయారు. 63 ఏళ్ల ముఖ్తార్‌ అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్తార్‌ అన్సారీ మృతికి సంబంధించిన మెడికల్ బులెటిన్‌ను అధికారులు విడుదల చేశారు. 'ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బాందా జైలులో(Banda Jail) శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు.

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ(Gangster Mukhtar Ansari) గుండెపోటుతో(Heart attcak) చనిపోయారు. 63 ఏళ్ల ముఖ్తార్‌ అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్తార్‌ అన్సారీ మృతికి సంబంధించిన మెడికల్ బులెటిన్‌ను అధికారులు విడుదల చేశారు. 'ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బాందా జైలులో(Banda Jail) శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. ఆ వెంటనే ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స మొదలుపెట్టినప్పటికీ గుండెపోటుతో అన్సారీ చనిపోయారు' అని మెడికల్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. అన్సారీ మృతితో హాస్పిటల్‌ పరిసరాలలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్‌(Section 144) విధించారు. బాందా, మౌ, ఘాజీపూర్‌, వారణాసి జిల్లాలలో అదరను బలగాలను మోహరింపచేశారు. రెండు రోజుల కిందట అన్సారీ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. అన్సారీకి జైలులో విషం కలిపిన ఆహారం ఇచ్చారని ఆయన సోదరుడు, ఘాజీపూర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. ఈ ఆరోపణను పోలీసులు కొట్టేశారు. ఆరోగ్యం బాగోలేని కారణంగా లెట్రిన్‌లో పడిపోయారని, వెంటనే ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు చెబుతున్నారు. ముఖ్తార్‌ అన్సారీపై 61 కేసులు ఉన్నాయ. ఇందులో 15 హత్య కేసులు ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన అన్సారీ ఎనిమిదో దశకంలోనే గ్యాంగ్‌ సభ్యుడయ్యారు. తొమ్మిదో దశకానికి వచ్చేసరికి సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడ్డారు. 2004లో ఈయన దగ్గరకు మెషిన్‌గన్‌ దొరికడంతో ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో వేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్య కేసులో లాస్టియర్‌ ఏప్రిల్‌లో కోర్టు అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. నకిలీ తుపాకీ లైసెన్స్‌ కలిగి ఉండటంతో ఈయనకు ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది.

Updated On 29 March 2024 12:26 AM GMT
Ehatv

Ehatv

Next Story