వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(BJP) టికెట్ నిరాకరించడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్(Jagdish Shettar) ఆ పార్టీని వీడిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నాయకులు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో బెంగళూరులోని కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న ఆంగ్రెస్‌ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ(BJP) టికెట్ నిరాకరించడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్(Jagdish Shettar) ఆ పార్టీని వీడిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నాయకులు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో బెంగళూరులోని కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం ఆయ‌న ఆంగ్రెస్‌ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. జగదీశ్ శెట్టర్ నుంచి ఎలాంటి డిమాండ్ లేదని.. మేం ఏమీ ఇవ్వట్లేదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shiva Kumar) అన్నారు. ఆయన పార్టీ సూత్రాలు, నాయకత్వంతో ఏకీభవించాల్సి ఉంటుంది. దేశాన్ని సమైక్యంగా ఉంచాలని.. అది కాంగ్రెస్ మాత్రమే చేయగలదని అన్నారు.

బెంగళూరులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కర్ణాటక ఇన్‌చార్జి) రణదీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah)లను షెట్టర్ కలిశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Elections - 2023)లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ నిరాక‌రించ‌డంతో జగదీష్ శెట్టర్ ఆదివారం నాడు త‌న‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. షెట్టర్ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ సూచించినట్లు సమాచారం.

అంతకుముందు షెట్టర్ మాట్లాడుతూ.. ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను.. నన్ను సొంత ఇంటి నుంచి గెంటేశారు.. అసెంబ్లీకి కూడా రాజీనామా చేశాను. టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను పార్టీ కేంద్ర నాయకత్వం చెప్పలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం నన్ను ఎన్నికల రంగంలో దింపకుండా కొందరు కుట్ర పన్నారని అన్నారు.

జగదీశ్ షెట్టర్ గతంలో ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ నల్వాడ్‌పై 21,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇటీవ‌ల‌ సీనియర్ నేత లక్ష్మణ్ సవాది(laxman Sawadi) కూడా బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

Updated On 17 April 2023 1:37 AM GMT
Yagnik

Yagnik

Next Story