ఒడిశాలోని(Odisa) పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాయలంలోని(Jagannatha Temple) రత్న భాండాగారాన్ని(Ratna Bhandagar) ఈ నెల 14వ తేదీన తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే
ఒడిశాలోని(Odisa) పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాయలంలోని(Jagannatha Temple) రత్న భాండాగారాన్ని(Ratna Bhandagar) ఈ నెల 14వ తేదీన తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రహస్య గదిలో నిక్షిప్తమైన అయిదు పెట్టలలో అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి. వాటిని లెక్కించబోతున్నారు. అయితే పురాతన దేవాలయాలలోని ఖజానాలకు సర్పాలు(snake) కాపలాగా ఉంటాయన్న విశ్వాసం చాలా మందికి ఉంది! అనేక సినిమాల్లో చూశాం కూడా! అందుకే రహస్య గదిని తెరవడానికి సిద్ధమవుతున్న అధికారులకు పాముల భయం వెంటాడుతోంది. రత్న భాండాగారం తెరిచే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. గది తెరిచే సమయంలో పాములు పట్టేవారు(Snake Charmers) ఉండాలని, వారితో పాటు వైద్య బృందం(Medical team) కూడా ఉండాలని కోరామని శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు. జగన్నాథ స్వామికి వెలకట్టలేని ఆభరణాలు ఉన్నాయి. వాటన్నింటిని అయిదు కర్రపెట్టెలలో ఉంచి రహస్య గదిలో భద్రంగా ఉంచారు. అప్పట్లో గదిని తెరిచి సంపదను లెక్కించేవారు. 1978 తర్వాత రత్న భాండాగారం గదిని తెరవలేదు. అందుకు రకరకాల కారణాలు చెప్పారు. తాళం చెవి కనిపించడం లేదని కూడా అన్నారు. కొత్తగా కొలువైన బీజేపీ ప్రభుత్వం భాండాగారాన్ని తెరవాలని నిర్ణయం తీసుకుంది.