జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే గొప్ప శోభాయాత్ర. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒడిశాలోని పూరి నగరంలో అత్యంత వైభవంగా జరుగుతుందీ యాత్ర! ఆ రోజున జనులందరికీ పర్వదినం.

జగన్నాథ రథయాత్ర(Jagannath Ratha Yatra) భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే గొప్ప శోభాయాత్ర. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒడిశా(Odisha)లోని పూరి నగరంలో అత్యంత వైభవంగా జరుగుతుందీ యాత్ర! ఆ రోజున జనులందరికీ పర్వదినం. జగన్నాథ రథయాత్ర కేవలం ఒడిశాకే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ సంబరాలలో పాల్గొనడానికి తరలి వస్తారు. పర్యాటకులు విశేషంగా వస్తారు. ఈ రథోత్సవంలో తన తోబుట్టువులైన బలరాముడు, సుభద్రలతో కలిసి జగన్నాథుడు కుర్చుని ఉంటారు. భారీ రథాలలో జగన్నాథుడు ఊరేగుతూ తన అత్తగారి ఇంటికి చేరుకుంటాడు.

పూరి జగన్నాథుని తీర్థయాత్ర ప్రతి ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం (విదియ)రెండో రోజున జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర రేపు అంటే ఆదివారం జూలై 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీన ముగుస్తుంది. జగన్నాథుని రథయాత్ర మేళ తాళాలతో బయలుదేరే సమయంలో పూరి చుట్టుపక్కల ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ రథయాత్ర ఒక సమాధి వద్ద ఆగుతుంది. ఇక్కడ మూడు రథాలు కాసేపు ఆగి, సమాధికి సమీపంలో ఉన్న ఆత్మలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయని పండితులు చెబుతారు. ఇలా ఆగడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం, జగన్నాథుడికి సల్బేగ్ అనే ఓ ముస్లిం భక్తుడు ఉండేవాడు. సల్బేగ్ తల్లి హిందువు, తన తండ్రి ముస్లిం. ఆయన ముస్లిం అయినందున జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి లేదా ప్రవేశించడానికి అనుమతించబడలేదు. అయితే సల్బేగ్ చూపిన భక్తికి జగన్నాథుడు చాలా సంతోషించాడు. జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన తర్వాత గండిచా ఆలయానికి చేరుకుంటారు. గండిచా ఆలయాన్ని గుండిచా బారి అని కూడా అంటారు. ఇక్కడే జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర దేవి ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. గుండిచా ఆలయంలో జగన్నాథుని దర్శనాన్ని ఆడప్ దర్శనం అంటారు. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవి విగ్రహాలను దేవుడైన విశ్వకర్మ ఇక్కడ నిర్మించాడని గుండిచా బారి గురించి చెబుతారు.జగన్నాథ రథ చక్రాలు కదులుతున్నాయి...!

Eha Tv

Eha Tv

Next Story