కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections)కు మరో పక్షం రోజులే ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార, విపక్షాల పరస్పర ఆరోపణలతో మైకులు మారుమోగుతున్నాయి. ఇప్పుడకక్కడ లింగాయత్(Lingayat) అన్న పదం ట్రెండింగ్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah) లింగాయత్‌లను అవమానించారంటూ బీజేపీ అంటుంటే, సిద్ధరామయ్య అన్నదాన్ని బీజేపీ వక్రీకరిస్తోందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి చేస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections)కు మరో పక్షం రోజులే ఉంది. అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. అధికార, విపక్షాల పరస్పర ఆరోపణలతో మైకులు మారుమోగుతున్నాయి. ఇప్పుడకక్కడ లింగాయత్(Lingayat) అన్న పదం ట్రెండింగ్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah) లింగాయత్‌లను అవమానించారంటూ బీజేపీ అంటుంటే, సిద్ధరామయ్య అన్నదాన్ని బీజేపీ వక్రీకరిస్తోందంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి చేస్తోంది. అవినీతి లింగాయత్ ముఖ్యమంత్రి అని సిద్ధరామయ్య కామెంట్ చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్ షెట్టర్(Jagadish Shettar)
సమర్థించారు. జగదీశ్ కూడా లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. కేవలం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai)ను ఉద్దేశించి మాత్రమే సిద్ధరామయ్య మాట్లాడారని, అందరు లింగాయత్ ముఖ్యమంత్రుల గురించి కాదని జగదీశ్ అన్నారు. బొమ్మై మాత్రమే అవినీతిపరుడన్నది సిద్ధరామయ్య ఉద్దేశమని, అసలాయన లింగాయత్‌లు మొత్తం అవినీతిపరులని అనలేదని జగదీశ్ షెట్టర్ వివరించారు. లింగాయత్‌లకు బీజేపీ చేసిందేమీ లేదని, ఇప్పటికే చాలా మంది లింగాయత్ నేతలు బీజేపీని వదిలేసి ఇతర పార్టీల్లో చేరారని జగదీశ్ పేర్కొన్నారు. తన ఆత్మగౌరవాన్ని బీజేపీ దెబ్బ తీసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారని, వారు బీజేపీ ఓటు వేయకుండా తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. బీజేపీ నేత అయిన జగదీశ్ షెట్టర్‌కు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. షెట్టర్‌ను కాదని మహేష్ తెంగినకాయ్‌కు టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో జగదీశ్ కాంగ్రెస్ తరపున వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో హుబ్లీ-ధార్వాడ్-సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు.
ఇదిలా ఉంటే కర్ణాకటలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) జోరుగా ప్రచారం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. జగదీశ్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. జగదీశ్ ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చారంటే అది బీజేపీ కారణంగానేనని అమిత్ షా అన్నారు.