ఒడిశా(Odisha)లో ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్‌కమ్ టాక్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి అరవింద్ సాహు ఇల్లు, కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో సోదాలు జరిగాయి. అలాగే భువనేశ్వర్, సుందర్‌గఢ్, బౌద్ధ్ జిల్లాలతో పాటు టిట్లాగఢ్లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాలలో సోదాలు నిర్వహించారు ఇన్‌కమ్ టాక్స్ అధికారులు.
ఒడిశా(Odisha)లో ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్‌కమ్ టాక్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి అరవింద్ సాహు ఇల్లు, కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో సోదాలు జరిగాయి. అలాగే భువనేశ్వర్, సుందర్‌గఢ్, బౌద్ధ్ జిల్లాలతో పాటు టిట్లాగఢ్లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాలలో సోదాలు నిర్వహించారు ఇన్‌కమ్ టాక్స్ అధికారులు. టిట్లాగఢ్ పట్టణంలో ఉంటున్న దీపక్ సాహు, సంజయ్ సాహు, రాకేశ్ సాహుల ఇళ్లలో ఇప్పటికే 510 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బీరువాలలో చక్కగా పేర్చిన నోట్ల కట్టలను చూసి అధికారులు బిత్తరపోయారు. స్వాధీనం చేసుకున్న నగదును బొలంగీర్ ఎస్‌బీఐ శాఖకు తరలించారు.