ఎన్నికల సమీపిస్తున్న కొద్ది పెట్రోల్ (Petrol), డీజిల్ (Deasel) ధరలను తగ్గించాలని కేంద్రం (Central Govt) ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న కొద్ది పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలను తగ్గించాలని కేంద్రం (Central Govt) ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికల ముందు ఈ బడ్జెట్‌లో తాయిలాలు ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టాండర్డ్ డిడక్షన్ మరింత పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ధరలు తగ్గించాలని కేంద్రం యోచిస్తుందని సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం, వాటికి అనుసంధానంగా ఉన్న అన్ని రంగాల్లో ఈ ధరలపై ప్రభావం పడ్డాయి. దీంతో నిత్యావసర వస్తువులు, ఇతర ధరలు పెరిగిపోయి సామాన్యుడి నెత్తిమీద కుంపటి అయ్యి కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రలో, డీజిల్ ధరలను రూ.10 నుంచి 15 వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) లో పెట్రోల్ ధర రూ.110గా, డీజిల్ ధర రూ.100గా ఉంది ఎన్నికలకు ముందు దీంతో పాటు పలు తాయిలాలు ప్రకటించి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ సర్కార్ ఆలోచనలో ఉందని తెలుస్తోంది.