దేశంలో కరోనా వైరస్‌(Corona Virus) వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. వైరస్‌ సోకి కొందరు చనిపోయారు కూడా! దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలు(IT Companies) అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలకు దిగాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసులు మరింత పెరిగితే మాత్రం మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్పిస్తే(Work From Home) బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారట! ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ వర్క్‌(Hybrid Work) చేస్తున్న ఉద్యోగులను విప్రో(Wipro) అలెర్ట్ చేసింది.

దేశంలో కరోనా వైరస్‌(Corona Virus) వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. వైరస్‌ సోకి కొందరు చనిపోయారు కూడా! దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలు(IT Companies) అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలకు దిగాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. కేసులు మరింత పెరిగితే మాత్రం మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్పిస్తే(Work From Home) బాగుంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారట! ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ వర్క్‌(Hybrid Work) చేస్తున్న ఉద్యోగులను విప్రో(Wipro) అలెర్ట్ చేసింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సంస్థ వృద్ధితో పాటుగా ఉద్యోగుల శ్రేయస్సు కూడా తమకు ముఖ్యమేనని చెప్పింది. నవంబర్ నుండి పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు వారానికి మూడు రోజులు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారని, తాము ఇచ్చిన ఆదేశాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటామని, ఉద్యోగులకు జాగ్రత్త కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని విప్రో తెలిపింది. నవంబర్‌ 15వ తేదీ నుంచి ఉద్యోగులకు హైబ్రిడ్‌ వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది విప్రో. ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని చెప్పింది. వారికి కేటాయించిన ప్రాంతాలలో పని చేయాల్సిందనని ఆదేశించింది. ప్రస్తుతం హైబ్రిడ్‌ విధానంలో ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తే మరో రెండు రోజులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఉద్యోగులకు మళ్లీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

Updated On 26 Dec 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story