ఈ మధ్యన కర్నాటక(Karnataka) ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బూమరాంగ్‌ అవుతున్నాయి.

ఈ మధ్యన కర్నాటక(Karnataka) ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బూమరాంగ్‌ అవుతున్నాయి. ఐటీ ఉద్యోగుల(IT Employees) పని వేళలలో(Working Hours) రోజుకు పది గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలనుకుంటోంది కర్నాటక ప్రభుత్వం. ఇందుకోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1961ని సవరించాలని అనుకుంటోంది. ఇంకా కార్యరూపం దాల్చలేదు కానీ అప్పడే ఐటీ రంగ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చేస్తోంది. ప్రభుత్వ ఆలోచన సరికాదని.. కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు అంటున్నారు. ఇప్పటికే వారు కార్మిక మంత్రి సంతోష్ లాడ్‌తో(Santhosh Laad) సమావేశమయ్యారు. తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. దీని ప్రభావం కర్నాటకలోని 20 లక్షల మంది ఉద్యోగులపై ఉంటుందని మంత్రికి చెప్పారు. కొత్త ప్రతిపాదన అమలులోకి వస్తే మాత్రం

ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగి ఒక రోజులో 12 గంటల కంటే ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలలో గరిష్టంగా 10 గంటలు మాత్రం పని చేయడానికి అనుమతి ఉంది. ఓవర్‌టైమ్‌ చేయాల్సి వచ్చినా పది గంటలకు దాటి పని చేయడానికి వీల్లేదు. ఒక ఉద్యోగితో మూడు నెలల్లో 125 గంటలకు మించి అదనపు పనిగంటలు చేయించకూడదు. అయితే పని గంటల పెంపునకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు మాత్రమే జరుగుతున్నాయని కర్నాటక రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అంటున్నారు.

వారంలో 48 గంటలకు మించి ఉద్యోగుల చేత పనిచేయించుకోకూడదని కార్మక చట్టాలు చెబుతున్నాయని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పనిగంటలు పెరిగితే.. ఉద్యోగి మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చెబుతున్నాయి.

Updated On 21 July 2024 11:47 AM GMT
Eha Tv

Eha Tv

Next Story