భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) షార్ కేంద్రం లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు సాయంత్రం సరిగ్గా 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14(GSLV F-14) రాకెట్ ను ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) షార్ కేంద్రం లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు సాయంత్రం సరిగ్గా 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14(GSLV F-14) రాకెట్ ను ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్-3(INSAT-3) డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తు లోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేసినట్లు తెలిపారు. షార్ కేంద్రం నుంచి ఇది 92వ ప్రయోగం కావడం విశేషం. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు..