బెంగళూరు: ఓ వైపు చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3(Chandrayan) స్పేస్‌ క్రాఫ్ట్‌ను పంపిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపైన ఫోకస్‌ పెట్టింది. సూర్యుడిపై రీసెర్చ్‌ కోసం తొలిసారిగా "ఆదిత్య-ఎల్‌ 1″(Adithya-L1) ప్రయోగానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. "ఆదిత్య- ఎల్‌ 1" అనే శాటిలైట్‌ని(Satellite) సెప్టెంబరు మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57(PSLV-57) వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నారు. 1500 కిలోల బరువు ఉండే 'ఆదిత్య-ఎల్‌ 1 ఫోటోలను సోమవారం ఇస్రో తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఈ ప్రయోగంలో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకోనుంది. గ్రహణాల సమయంలో కూడా స్టాప్‌గా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు వీలుగా భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య-ఎల్‌ 1ను ప్రవేశపెట్టనున్నారు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సూర్యుడి చుట్టూ ఉండే వాతావరణంపై రీసెర్చ్‌ చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఆదిత్య -ఎల్ 1 ఎలా పనిచేస్తుందంటే

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ ఆదిత్య L1 ప్రయోగం చేపడుతున్నారు. ఈ ప్రయోగం కోసం ఇస్రో 1500 కిలోల బరువున్న శాటిలైట్‌ని పంపనున్నారు.

గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో ఆదిత్య L1 ని ప్రవేశపెట్టనున్నారు.

అ్రదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన 'విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)తో పాటు సోలార్‌ అల్ట్రా వైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్‌, 'హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ పేలోడ్‌లను అమర్చనున్నారు.

ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రస్తుతం చంద్రుడికి మరింత చేరువైంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23 సాయంత్రం ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం కొద్దీ రోజుల వ్యవధిలోనే ఆదిత్య-ఎల్‌ 1 నింగిలోకి దూసుకెళ్లనుంది.

Updated On 15 Aug 2023 2:26 AM GMT
Ehatv

Ehatv

Next Story