భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి, దేశ ప్రజలకు ఒక చేదు వార్త. ఇస్రో శాస్త్రవేత్త ఇక లేరు. భారతదేశం యొక్క మూన్ మిషన్ అంటే చంద్రయాన్-3 యొక్క కౌంట్‌డౌన్‌ను లెక్కించే ఆ వాయిస్ ఇక విన‌బ‌డ‌దు. శాస్త్రవేత్త వలరామతి గుండెపోటుతో కన్నుమూశారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కి, దేశ ప్రజలకు ఒక చేదు వార్త. ఇస్రో శాస్త్రవేత్త ఇక లేరు. భారతదేశం యొక్క మూన్ మిషన్ అంటే చంద్రయాన్-3 యొక్క కౌంట్‌డౌన్‌ను లెక్కించే ఆ వాయిస్ ఇక విన‌బ‌డ‌దు. శాస్త్రవేత్త వలరామతి(Valaramathi) గుండెపోటు(Heart Attack)తో కన్నుమూశారు.

కొంతమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, స్టార్లు, క్రీడా ప్రముఖుల గొంతులు జీవితాంతం మన మదిలో ఉంటాయి. అలాంటి ఒక స్వరం మూగ‌బోయింది. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో తన అద్వితీయ స్వరంతో ప్రకటనలు చేసిన వలరామతి ఆదివారం సాయంత్రం క‌న్నుమూశారు. ఆమె మృతితో ఇస్రో శాస్త్రవేత్తల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

తమిళనాడు(Tamil Nadu)లోని అరియలూరుకు చెందిన వలరామతి ఆదివారం(Sun Day) సాయంత్రం కన్నుమూశారు. రాజధాని చెన్నై(Chennai)లో ఆమె తుది శ్వాస విడిచారు. ఇటీవ‌ల‌ చంద్రయాన్ 3ని ప్రయోగించిన విష‌యం తెలిసిందే. ప్రారంభ కౌంట్‌డౌన్‌(Countdown)కు వలరామతి గాత్రదానం చేశారు.

వలరామతి మృతి పట్ల ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ పివి వెంకటకృష్ణ(PV Venkata Krishna) సంతాపం తెలిపారు. ఇస్రో భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్‌లో ఇకపై వలర్మతి గొంతు వినిపించద‌ని ఆయన అన్నారు. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్. వలరామతి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. వలరామతి మ‌ర‌ణంపై సోషల్ మీడియా(Social Media)లో కూడా ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Updated On 3 Sep 2023 10:38 PM GMT
Yagnik

Yagnik

Next Story