మూడు దశల్లో రాకెట్‌(Rocket) ‍ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. విజయవంతంగా చంద్రునిపై(Moon) ల్యాండ్‌ అవ్వాలని శాస్త్రవేత్తలు ఆకాంక్షించారు. శ్రీహారికోటలో(Sriharikota) ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఒక చారిత్రాత్మక రోజని ఇస్రో పేర్కొంది. యావత్‌ దేశ ప్రజలందరి ఆకాంక్షలు నిజమవ్వాలని ఆకాంక్షించింది. చంద్రయాన్‌-3 మిషన్‌ కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌(ISRO Chairman Somnath) అభినందనలు తెలిపారు. ఇస్రో సత్తాకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

చందమామపై అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌-3 విజయవంతంగా చంద్రుడి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. ఎల్‌వీఎం 3 ఎం 4 రాకెట్ నుంచి శాటిలైన్‌ విజయవంతంగా విడిపోయింది. సరిగ్గా 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది ఎల్‌వీఎం-3ఎం4(LVM-3M4) రాకెట్‌.

సుమారు 3.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 23లేదా 24న చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్ కానుంది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్ మాడ్యూల్‌ను మోసుకుని వెళ్లిన ఈ అత్యంత శక్తివంతమైన రాకెట్‌ నింగిలోకి ఎగరగానే కోటానుకోట్ల భారతీయుల మోముల్లో ఆనందం తొణికిసలాడింది. ప్రత్యక్షంగా చూస్తున్నవారు కేరింతలు కొట్టారు. చప్పట్లతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్‌–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు అనేక దేశాలు చంద్రుడికి ముందువైపు అనగా ఉత్తరధృవంపై పరిశోధనలు చేశాయి. ఇండియా మాత్రం చంద్రయాన్‌-1 నుంచి తాజా చంద్రయాన్‌-3 వరకు జాబిల్లి వెనుక వైపు, అంటే దక్షిణ ధృవాన్ని పరిశోధించడానికి ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధృవపు చీకటి ప్రాంతంలో దించనున్నారు.

Updated On 14 July 2023 4:54 AM GMT
Ehatv

Ehatv

Next Story